Allu arjun kerala student : కలెక్టర్ వినతితో కేరళ విద్యార్థి బాధ్యతలు తీసుకున్న ఐకాన్ స్టార్.. సంతోషంలో ఫ్యాన్స్?

సాధారణంగా కొంతమంది చిన్న పని చేసిన పెద్ద ఎత్తున ప్రమోట్ చేసుకుంటూ ఉంటారు కానీ మరి కొందరు మాత్రం ఒక చేతితో చేస్తున్న సహాయం మరొక చేతికి తెలియకుండా గోప్యంగా ఉంచుతారు.ఇలాంటి కోవకు చెందిన వారే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.

 Icon Star Took Responsibility Of Kerala Student With Collector Vinathi Are Fans-TeluguStop.com

తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు పొందిన అల్లు అర్జున్ పలు సామాజిక సేవా కార్యక్రమాలను చేస్తూ తన మంచి మనసును చాటుకుంటారు.అయితే తాను చేసిన సహాయాలను బయటకు చెప్పుకోవడానికి ఈయన ఏమాత్రం ఇష్టపడరని తాజాగా నిరూపితమైంది.

కేరళలో ఒక పేద విద్యార్థి పట్ల అల్లు అర్జున్ చూపించినటువంటి సేవాగుణం ప్రస్తుతం వెలుగులోకి రావడంతో బన్నీ ఫ్యాన్స్ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.కేరళలో ఓ అమ్మాయికి 92 శాతం మార్కులు వచ్చిన ఆర్థిక స్తోమత లేకపోవడంతో పై చదువులు చదువు లేకపోయింది.

ఈ క్రమంలోనే అలెప్పీ కలెక్టర్ కృష్ణతేజ ఆ అమ్మాయి కోసం వియ్యార్ ఫర్ అలెప్పీ అనే స్లోగన్‌తో చేపట్టిన ఈ మూమెంట్లో హీరో అల్లు అర్జున్ కి ఫోన్ చేసి ఆ అమ్మాయి గురించి వివరించడంతో వెంటనే అల్లు అర్జున్ తన చదువుకు అయ్యే ఖర్చులను తానే భరిస్తానని, ఆ అమ్మాయి బాధ్యత పూర్తిగా తానే తీసుకుంటానని భరోసా ఇచ్చారు.

Telugu Allu Arjun, Krishna Teja, Icon, Tollywood-Movie

ఆమెకు నర్సింగ్ కాలేజ్‌లో మేనేజ్‌మెంట్ కోటాలో సీటుకయ్యే ఖర్చు తాను భరిస్తాననీ, అదేవిధంగా హాస్టల్ ఫీజు కూడా తానే భరిస్తానంటూ ఈ సందర్భంగా అల్లు అర్జున్ హామీ ఇచ్చారు.అయితే ఈ విషయాన్ని ఎక్కడ అల్లు అర్జున్ ప్రస్తావించలేదు.ఇకపోతే తాజాగా అలెప్పి కలెక్టర్ కృష్ణ తేజ ఆ అమ్మాయి విషయాలను గోపెయంగా ఉంచుతూ అల్లు అర్జున్ చేసినటువంటి ఈ సహాయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేయడంతో ఈ విషయం కాస్త వెలుగులోకి వచ్చింది.

ఇక ఇది తెలిసినటువంటి బన్నీ ఫాన్స్ దటీజ్ ఐకాన్ స్టార్ అంటూ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube