పల్నాడు జిల్లా నర్సరావుపేటలో బాలుడు అదృశ్యం కేసులో ట్విస్ట్ నెలకొంది.పిట్టగోడపై కూర్చోబెట్టి తల్లి ఆడిస్తున్న సమయంలో బాలుడు ప్రమాదవశాత్తు బావిలో పడి మృతిచెందాడు.
ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురైన తల్లి డిప్రెషన్ లో బాలుడు కనిపించడం లేదని చెప్పింది.దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు బావిలో చిన్నారి మృతదేహాన్ని గుర్తించారు.అనుమానంతో తల్లిని విచారించగా ఆడిస్తున్న సమయంలో బాలుడు బావిలో పడిపోయాడని వెల్లడించింది.
అయితే బాలుడు ప్రమాదవశాత్తు పడిపోయాడా.? లేదా కావాలనే పడేశారా.? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.