మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ( Trivikram Srinivas ) ప్రజెంట్ సూపర్ సక్సెస్ తో దూసుకు పోతున్నారు.ఈ క్రమంలోనే మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతుంది.
ఈయన ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో ప్రజెంట్ ‘గుంటూరు కారం‘ ( Guntur Kaaram ) చేస్తున్నాడు.ఈ సినిమా షూట్ ఆల్ మోస్ట్ పూర్తి అయ్యింది.
సంక్రాంతి రేసులో జనవరి 12న ఈ సినిమాను ఆడియెన్స్ ముందుకు తీసుకు రాబోతున్నారు.మరి ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ నెక్స్ట్ పై ఇప్పుడు ఇంట్రెస్టింగ్ విషయం వైరల్ అవుతుంది.
త్రివిక్రమ్ నెక్స్ట్ సినిమాను అల్లు అర్జున్ తో ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ కాంబోలో ఇప్పటికే ముచ్చటగా మూడు సినిమాలు రాగా మూడు కూడా సూపర్ హిట్ అయ్యాయి.ఇక హ్యాట్రిక్స్ హిట్ తమ ఖాతాలో వేసుకున్న తర్వాత మరోసారి ఈ కాంబో కలిసి పని చేయబోతుంది.ఇటీవలే ఈ ప్రాజెక్ట్ అఫిషియల్ అప్డేట్ వచ్చింది.
అయితే త్రివిక్రమ్ గుంటూరు కారం తర్వాత అల్లు అర్జున్ తో సినిమా చేయడం లేదని గత కొద్దీ రోజులుగా వార్తలు వస్తున్నాయి.
ఎందుకంటే ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో ”పుష్ప ది రూల్” ( Pushpa The Rule ) చేస్తున్న విషయం విదితమే.ఇది సగానికి పైగానే షూట్ పూర్తి చేసుకుని ప్రజెంట్ శరవేగంగా జరుగుతుంది.ఈ ప్రాజెక్ట్ ఆగస్టు నాటికీ రిలీజ్ కానుంది.
మరి ఈ లోపులో త్రివిక్రమ్ మరో హీరోతో సినిమా చేయనున్నట్టు వార్తలు వైరల్ అవుతున్నాయి.అది కూడా న్యాచురల్ స్టార్ నానితో ( Nani ) అని ఇటీవల రూమర్స్ గట్టిగానే వినిపించాయి.
అయితే గుంటూరు కారం రిలీజ్ తర్వాతనే గురూజీ నెక్స్ట్ పై క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది.చూడాలి త్రివిక్రమ్ అల్లు అర్జున్ కోసం ఆగుతారో.
లేదంటే ఈ లోపులో మరో మూవీ కంప్లీట్ చేస్తారో.