'లేడీ గెటప్'లో చిరంజీవి, బాలయ్య ఎంత బాగున్నారో.. ఇంకా చాలామంది?

తెలుగు సినీ చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయకులుగా ఉన్న మన హీరోల సినిమాలలో వారు ఎప్పుడు హీరోయిజం చూపిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తుంటారు.అయితే ఆ హీరోలు ఒకసారిగా లేడీ గెటప్ లో కనిపించి, అచ్చం అమ్మాయిలాగే హావభావాలను వ్యక్తపరుస్తూ నటిస్తే ప్రేక్షకులకు ఎంతో ఎంటర్టైన్మెంట్ లభిస్తుంది.

 Lady Getup, Hero Chiranjeevi, Hero Kamal Hassan, Actor Rajendra Prasad, Actor Na-TeluguStop.com

అలా లేడీ గెటప్ లో నటించి ప్రేక్షకులను ఎంతగానో అలరించిన మన స్టార్ హీరోలు ఎవరో ఇక్కడ చూద్దాం…

*బాలకృష్ణ: నట సింహం నందమూరి బాలక‌ష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఎన్నో సినిమాల్లో అద్భుతంగా నటించిన బాలకృష్ణ పాండురంగడు సినిమాలో లేడీ గెటప్ లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.

Telugu Naresh, Rajendra Prasad, Ali, Allu Arjun, Chiranjeevi, Kamal Hassan, Manc

*చిరంజీవి: 150 పైగా చిత్రాలలో నటించిన చిరంజీవి టాలీవుడ్ మెగాస్టార్ గా ఎన్నో హిట్ చిత్రాలను అందుకున్నాడు.అన్ని సినిమాలలో తన హీరోయిజం చూపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.అయితే చిరంజీవి చంటబ్బాయి సినిమాలో లేడీ గెటప్ లో నటించి ప్రేక్షకులలో ఆనందాన్ని రెట్టింపు చేశాడు.

*కమల్ హాసన్: టాలీవుడ్ ప్రఖ్యాత కళాకారులలో కమల్ హాసన్ ఒకరు.ఇటు తెలుగులోనూ,అటు తమిళంలోనూ ఎంతో క్రేజ్ ఉన్న కమల్ హాసన్ భామనే సత్య భామనే చిత్రాలలో భామ, దశావతారం పాత్రలలో లేడీ దుస్తులను ధరించి అందరిని ఆశ్చర్య పరిచాడు.

*రాజేంద్ర ప్రసాద్: ఎన్నో హాస్యాస్పద చిత్రాలలో హీరోగా నటించిన నటకిరీటి రాజేంద్రప్రసాద్ తన మాట తీరు తో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.అయితే రాజేంద్రప్రసాద్ లేడీ గెటప్ లో మేడమ్, వివాహ భోజనంబు, ఆల్ రౌండర్ చిత్రాలలో నటించి అందరినీ మెప్పించారు.

*నరేష్: టాలీవుడ్ పరిశ్రమలోనీ ఉత్తమ నటులలో నరేష్ ఒకరు.ఎన్నో సినిమాలలో విభిన్న పాత్రలలో నటించిన నరేష్ చిత్రం భళారే విచిత్రం సినిమాలో లేడీ దుస్తులతో ఆయన చేసిన నటనకు ఎన్నో ప్రశంసలు కురిపించడంతో పాటు, ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

*మంచు మనోజ్: మంచు మనోజ్ టాలీవుడ్ లో అసాధారణమైన నటనతో, వ్యక్తిత్వం తో కూడిన యంగ్ డైనమిక్ హీరో.కామిక్ సినిమాలలో ప్రధాన నటుడిగా నటించిన మనోజ్ పాండవులు పాండవులు తుమ్మెద చిత్రంలో మోహిని అనే లేడీ గెటప్ లో నటించి అందరిని మెప్పించాడు.

*సుమంత్.

.ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రంలో ఏఎన్ఆర్ పాత్ర పోషించిన సుమంత్ ఏమో గుర్రం ఎగరవచ్చు సినిమాలో చీరకట్టుతో ఎంతో అందమైన డాన్స్ చేస్తూ అమ్మాయి వేషధారణలో అదరగొట్టాడు.

*అల్లు అర్జున్: ప్రస్తుతం టాలీవుడ్ లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వరుస సినిమాలతో దూసుకు పోతున్నాడు.అల్లు అర్జున్ తన మొదటి సినిమా గంగోత్రి ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు దర్శకత్వం నిర్వహించిన ఈ సినిమాలో అల్లు అర్జున్ లేడీస్ దుస్తులతో నటించారు.

*వెంకటేష్: హీరో వెంకటేష్ ఎన్నో కుటుంబ కథా చిత్రాలలో నటించి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.వెంకటేష్ బాడీగార్డ్ సినిమా కోసం లేడీ దుస్తులను ధరించి నటించాడు.

*అలీ: తెలుగు సినీ పరిశ్రమలు తన కామెడీ ద్వారా ఎన్నో సినిమాలలో నటించిన ఆలీ, లేడీ గెటప్ లో టాటా బిర్లా మధ్యలో లైలా, చిరుత, ఖైదీ నెంబర్ 150 వంటి మరెన్నో చిత్రాలలో లేడీ పాత్రలో నటించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube