ఐపీఎల్ లో టియాగో ఈవీ ప్రదర్శన.. కారుకు బాల్ ఎన్నిసార్లు తగిలితే అన్ని రూ.5 లక్షలు..!

భారత్ లో జరిగే ఐపీఎల్( IPL ) అంటే ఒక్క భారతీయ అభిమానులే కాదు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు.అంతేకాదు ఐపీఎల్ ద్వారా తమ ప్రాజెక్టులను పబ్లిసిటీ చేసుకునేందుకు కంపెనీలు పోటీ పడుతుంటాయి.

 Tiago Ev Performance In Ipl How Many Times The Ball Hits The Car, All Rs. 5 Lakh-TeluguStop.com

ఆ బాటలోనే టాటా మోటార్స్( Tata Motors ) బీసీసీఐ తో వరుసగా 6వ ఏడాది కూడా పార్టనర్ షిప్ కుదుర్చుకుంది.టాటా మోటార్స్ ఇటీవలే ప్రీమియం ఎలక్ట్రిక్ హ్యాచ్ బ్యాక్ టియాగో ఈవీని లాంచ్ చేసింది.

అయితే వీటి అమ్మకాలు పెంచుకునేందుకు బీసీసీఐతో ఐపీఎల్ 2023 ఎడిషన్ కు అఫీషియల్ పార్టనర్ గా ఒప్పందం కుదురుచుకుంది.తద్వారా ఐపీఎల్ మ్యాచ్లు జరిగే ప్రతి వేదికపై టాటా కంపెనీ టియాగో ఈవీ( Tiago EV ) ని ప్రదర్శించనుంది.

టాటా కంపెనీ ఈ ఐపీఎల్ సీజన్లో టియాగో ఈవీ పేరుతో అవార్డు కూడా ఇవ్వనుంది.ఈ ఐపీఎల్ సీజన్లో అత్యధిక స్ట్రైక్ రేట్ ఉన్న ఆటగాడికి ఈ టియాగో పేరుతో ట్రోఫీ ఇవ్వడంతో పాటు రూ.1,00,000 నగదును బహుమతిగా అందజేయనుంది.

అంతేకాకుండా కర్ణాటకలోని కాఫీ తోటలలో జీవవైవిద్యాన్ని మెరూపరచడానికి అవసరమైన మొక్కలు నాటడం కోసం టాటా మోటార్స్ కంపెనీ రూ.5 లక్షలు విరాళంగా అందజేయనుంది.ఈ ఐపీఎల్ సీజన్ లో ప్రదర్శిస్తున్న టియాగో ఈవీ కారుకు బాల్ తగిలితే ఐదు లక్షల రూపాయలు విరాళం అందజేయనుంది.

ఐపీఎల్ సీజన్ తర్వాత కారుకు ఎన్ని బాల్స్ తగిలితే అన్ని ఐదు లక్షల రూపాయలు విరాళంగా టాటా మోటార్స్ ఇవ్వనుంది.ఐపీఎల్ లో అఫీషియల్ పార్టనర్షిప్ ద్వారా ఎలక్ట్రిక్ వెహికల్స్ పై ప్రజలకు అవగాహన కల్పించడం, నగరాలు, చిన్న పట్టణాలలో ఎలక్ట్రిక్ వాహనాల ప్రాముఖ్యతను హైలెట్ చేయడం కోసం టాటా మోటార్స్ ఐపీఎల్ లో ఈ ఒప్పందం కుదుర్చుకుంది.

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్యను వేగంగా పెంచడం కోసం ఐపీఎల్ తమకు కీలకం అని కంపెనీ తెలిపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube