టైటానిక్ శిథిలాలను చూడడానికి వెళ్లిన టైటాన్ సబ్‌మెర్సిబుల్( Titan Sub ) ఆచూకీ ఇంకా దొరకలేదు.ఇదేవిధంగా సరిగ్గా 50 సంవత్సరాల క్రితం ఇద్దరు బ్రిటిష్ నావికులు( British Sailors ) 6 అడుగుల వెడల్పు గల జలాంతర్గామిలో 3 రోజుల పాటు సముద్రగర్భంలో గడపాల్సి వచ్చింది.
వాళ్ళు ప్రయాణిస్తున్న సబ్‌మెర్సిబుల్ సముద్రంలో సుమారు 1600 అడుగుల అగాధానికి పడిపోయింది.వాళ్లను రక్షించే సమయానికి జలాంతర్గామిలో 12 నిమిషాల ఆక్సిజన్ మాత్రమే మిగిలి ఉంది.వివరంగా చెప్పుకోవాలంటే ఇది పైసీస్ III కథ.1973 ఆగస్టు 29న ఈ జలాంతర్గామిలో ప్రయాణిస్తున్న రాయల్ నేవీ సిబ్బందిలో ఒకరైన 28 ఏళ్ల రోజర్ చాప్‌మన్, ( Roger Chapman ) 35 ఏళ్ల ఇంజనీర్ రోజర్ మలిన్‌సన్( Roger Malinson ) ప్రమాదవశాత్తు అట్లాంటిక్ మహాసముద్రం లోతులకు వెళ్లిపోయారు.వారిని వెతికిపట్టుకునేందుకు అప్పట్లో 76 గంటలపాటు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు.

కట్ చేస్తే అదృష్టవశాత్తు 3 రోజుల తరువాత ఇద్దరూ ప్రాణాలతో బయటపడ్డారు.ఆరోజు ఆక్సిజన్ ట్యాంకు కూడా మార్చారు మలిన్‌సన్.అది అనుకోకుండా జరిగిందని అతగాడు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
జలాంతర్గామి సముద్రం అడుగున 1575 అడుగులకు చేరి, అక్కడ ఆగిపోయింది.అలా మునిగినా ఏమీ కాకుండా బతికి ఉన్నందుకు సంతోషించామని మలిన్‌సన్ ఓ సందర్భంలో చెప్పారు.
తరువాత ఫోన్ ద్వారా వాళ్ళిద్దరికీ ఏమీ కాలేదన్న సమాచారాన్ని అందించారు.అప్పటికి 66 గంటల ఆక్సిజన్ మాత్రమే మిగిలి ఉంది.
కదిలినా, మాట్లాడినా ఆక్సిజన్ వేగంగా తరిగిపోతుంది.దాంతో ఇద్దరు కదలకుండా పడుకున్నారు.
లోపల 6 అడుగుల స్థలం మాత్రమే ఉంది.ఇద్దరూ ఎలాగోలా సర్దుకున్నారు.

ఇక సముద్రం వెలువల వీరిని కాపాడేందుకు సహాయక చర్యలు ప్రారంభం అయ్యాయి.పైసీస్ II, పైసీస్ V జలాంతర్గాములను సిద్ధంచేశారు.వికర్స్ వాయేజర్ కార్క్ నగరం నుంచి బయలుదేరింది.ఇది కాకుండా, రెస్క్యూ ఆపరేషన్‌లో సహాయం చేయడానికి మరికొన్ని నౌకలు, ఒక విమానాన్ని సంఘటనా స్థలానికి సమీపంలో మోహరించారు.
రెస్క్యూ ఆపరేషన్ మూడు రోజులు సాగింది.తరువాత ఎన్నో విఘాతాల తరువాత వారికీ పైసీస్ III కనిపించింది.
చివరికి 1973 సెప్టెంబర్ 1న పైసీస్ IIIని బయటకుతీశారు.చాప్‌మన్, మలిన్‌సన్ సముద్రం అడుగున పైసీస్ IIIలో 84 గంటల 30 నిమిషాలు గడిపారు.