సమాజంలో మనుషుల రూపంలో రాక్షసులు కూడా ఉన్నారని అప్పుడప్పుడు జరిగే కొన్ని సంఘటనలు నిరూపిస్తున్నాయి.ఇప్పుడు చదవబోయే ఘటన కూడా ఇలాంటిదే.
కానీ ఈ భయానక ఘటన ఇక్కడ కాదు లేండి అమెరికాలో.
ఇక ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుంటే.
అమెరికాలోని ఓక్లహోమాలో నివసించే లారెన్స్ పౌల్ ఆండర్సన్ అనే వ్యక్తి డ్రగ్స్ కేసులో అరెస్టయ్యి దాదాపు 20 ఏళ్ల పాటు జైలులో గడిపి ఈ మధ్య విడుదల అయ్యాడట.అయితే ఇతను రెండు వారాల క్రితం తన ఇంటి పక్క ఉండే వ్యక్తిని చంపేసి, అతడి గుండెను తీసుకుని తన అంకుల్ వాళ్ల ఇంటికి వెళ్లి అక్కడ ఆ గుండెని కోసి కర్రీ వండాడట.
![Telugu American, Cooked Curry, Heart, Oklahoma-Latest News - Telugu Telugu American, Cooked Curry, Heart, Oklahoma-Latest News - Telugu]( https://telugustop.com/wp-content/uploads/2021/02/curry-American-Oklahoma-man-cut-heart-cooked-curry-crime-newscrime-news.jpg)
దీనిని ఇతని అంకుల్ కుటుంబ సభ్యుల చేత తినిపించాలనుకున్నాడట.భయానికి లోనైన వారు ఇందుకు అంగీకరించక ఆక్కడి నుండి పారిపోవడానికి ప్రయత్నించే క్రమంలో పౌల్ అతడి అంకుల్ ని, వారి నాలుగేళ్ల కూతురిని చంపేశాడట.
ఇక గాయాల బారిన పడిన ఆ అంకుల్ భార్య ఎలాగో ఆ రాక్షసుని బారి నుండి తప్పించుకుని స్దానికులకు విషయం తెలిపిందట.కాగా బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఓక్లహోమా పోలీసులు పౌల్‌ని అరెస్ట్ చేసి, గాయపడిన మహిళను ఆస్పత్రిలో చేర్చారట.