టీఆర్ఎస్ పతనం నేటి నుంచి ప్రారంభం అయింది ...ధర్మపురి అరవింద్

కేసీఆర్ పతనం, టీఆర్ఎస్ పతనం నేటి నుంచి ప్రారంభమైందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు.కేటీఆర్ త్వరలో కేసీఆర్‌కు వెన్నుపోటు పొడవబోతున్నారని ఆయన జోస్యం చెప్పారు.

 The Fall Of Trs Started From Today ... Dharmapuri Arvind, Ts Potics , Etala Rajr-TeluguStop.com

టీఆర్ఎస్ పార్టీలో త్వరలో ముసలం పుట్టబోతున్నదన్నారు. హుజూరాబాద్ ఎన్నిక తర్వాత కేసీఆర్ గౌరవంగా తప్పుకుంటే మంచిదని హితవు పలికారు.

తెలంగాణ ప్రజలకు ఇక ముందు కేసీఆర్‌తో పనిలేదని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌కి సిగ్గుంటే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి దళితుడిని సీఎం చేయాలి.

కేసీఆర్ తెలంగాణ ప్రజలకు నాయకత్వం వహిస్తున్నారు కాబట్టే దేశ ప్రధాని, దేశ హోం మంత్రి ఆయనకు అపాయింట్మెంట్ ఇస్తున్నారు.దళితులకు మూడు ఎకరాల భూమిలాగా… దళితబంధు పథకాన్ని కూడా కేసీఆర్ చేస్తే ప్రజలు, బీజేపీ పోరాటం చేస్తాం.

నాగార్జున సాగర్‌లో అభ్యర్థి ఎంపిక తప్పిదం కాబట్టే అక్కడ ఓడిపోయాం.కేంద్ర ప్రభుత్వ పథకాలను ఉద్దేశపూర్వకంగా తెలంగాణలో పనిచేయడం లేదు.కేసీఆర్ అహంకారానికి హుజూరాబాద్ ఫలితాలు చెంపపెట్టు.రేపటి నుండి దళిత బంధు అమలు చేయాలి.

అని అరవింద్ పేర్కొన్నారు

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube