శివాలయం( Shiva )లో ఎక్కడ చూసినా ఖచ్చితంగా అక్కడ నంది విగ్రహం కూడా కనిపిస్తుంది. శివునికి, నందికి చాలా అవినాభావ సంబంధం ఉంది.
నందిని తనకు అత్యంత ఇష్టమైనదిగా పరమ శివుడు భావిస్తాడు.అందుకే చాలా మంది శివాలయాలకు వెళ్లినప్పుడు నంది చెవిలో తమ కోరికలను చెబుతుంటారు.
అలా చెబితే అవి నెరవేరుతాయని చాలా మంది విశ్వాసం.ఇక ఏ శివాలయంలో చూసినా నంది భక్తిభావంతో శివలింగానికి ఎదురుగా నమస్కరిస్తున్నట్లు కూర్చుని ఉంటుంది.
శివునికి అతిపెద్ద భక్తుడు నంది అని పండితులు చెబుతుంటారు.తాజాగా గుజరాత్‌లో ఓ ఆసక్తికర ఘటన జరిగింది.
ఓ ఎద్దు తన భక్తి భావాన్ని ప్రదర్శించింది.అది చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు.
చాలా మంది దాని భక్తి భావం చూసి పరవశించిపోతున్నారు.మనుషులు కూడా ఇంతలా భక్తిని చూపలేదని పేర్కొంటున్నారు.
దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.
మనుషులోనే కాకుండా జంతువులలో కూడా చాలా భక్తి భావం ఉంటుంది.ముఖ్యంగా శివాలయంలో శివుని విగ్రహంపై తరచూ పాములు చేరడం చూసి అందరూ ఆశ్చర్యపోతుంటారు.భక్తి భావంతో ఆ అద్భుత దృశ్యం చూసి ఆశ్చర్యపోతుంటారు.
ఇక గుజరాత్‌లోనూ ఇదే తరహాలో ఘటన జరిగింది.ఓ ఎద్దు శివాలయం ముందు నుంచి వెళ్తూ అక్కడ ఆగింది.
అకస్మాత్తుగా శివ లింగం( Shiva Lingam ) వైపు చూసి తన భక్తిని ప్రదర్శించింది.
వెంటనే ఆలయం ముందు వంగి, సాష్టాంగ నమస్కారం చేసింది.ఇది చూసిన అక్కడి వారంతా భక్తి పారవశ్యంలో మునిగిపోయారు.ఈ వీడియోను కొందరు సోషల్ మీడియా( Social media )లో పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది.
హరహర మహాదేవ్ శంభోశంకర అంటూ కామెంట్లు పెడుతున్నారు.దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా నెటిజన్లంతా ఆశ్చర్యపోతున్నారు.
ఆ ఎద్దు భక్తి భావాన్ని ప్రశంసిస్తున్నారు.ఇప్పటికే ఈ వీడియోకు లక్షల సంఖ్యలో వ్యూస్, వేల సంఖ్యలో షేర్లు లభించాయి.