టికెట్ల కేటాయింపు విషయంలో టిడిపిలో( TDP ) ఇంకా లొల్లి కొనసాగుతూనే ఉంది .ఎప్పటికి బిజెపి ,జనసేన పొత్తులో భాగంగా కొన్ని సీట్లను టిడిపి త్యాగం చేసింది.
దానిపైన మొన్నటి వరకు రచ్చ జరిగింది .పార్టీ కోసం కష్టపడి పనిచేసిన తమను తప్పించి నియోజకవర్గంలో బలం లేని ఇతర పార్టీలకు ఇక్కడ సీటు ఇవ్వడం పై టికెట్ దక్కని నేతలు బహిరంగంగానే పార్టీ పై విమర్శలు చేయడం, కొంతమంది పార్టీకి రాజీనామా చేసి ఇతర పార్టీల్లో చేరడం వంటివి చోటుచేసుకున్నాయి .తాజాగా అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు తెలుగుదేశం పార్టీలో మరో గందరగోళం నెలకొంది.ఇక్కడ టిడిపి టికెట్ ఆశించి భంగపడిన మాజీ ఎమ్మెల్యే గడ్డి ఈశ్వరి ( Former MLA Gaddi Ishwari )రెబల్ గా పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు.
ఐదేళ్లు పార్టీ కోసం సొమ్ములు ఖర్చు పెట్టానని నియోజకవర్గమంతా పార్టీని కేడర్ ను కాపాడుకుంటూ వచ్చానని , కానీ చివరి నిమిషంలో పార్టీలో చేరిన వారికి టిక్కెట్ ఇచ్చి తనను మోసం చేశారంటూ గిడ్డి ఈశ్వరి ఫైర్ అవుతున్నారు.ఈ మేరకు టీడీపీ రెబల్ గా పోటీ చేయనున్నట్టు ఆమె ప్రకటించారు. ప్రతి టిడిపి కార్యకర్త సైనికుడిలా పనిచేసి పాడేటు నియోజకవర్గంలో( Padetu Constituency )రెబల్ గా పోటీ చేస్తున్న తన గెలుపునకు కృషి చేయాలని ఈశ్వరి కోరారు.పాడేరు నియోజకవర్గంలో ఐదు మండలాల కార్యకర్తలతో కుమ్మరి పుట్టులోని తన నివాసంలో భవిష్యత్తు కార్యాచరణ పై సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో పాడేరు నియోజకవర్గంలోని ఐదు మండలాల కార్యకర్తలు పాల్గొన్నారు .ఈ సందర్భంగా రెబల్ గా పోటీ చేయాల్సిందిగా వారంతా ఈశ్వరికి సూచించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఈశ్వరి పార్టీకి ఏం ద్రోహం చేశానో కానీ, పాడేరు నియోజకవర్గంలో టిడిపి గెలుపే లక్ష్యంగా కష్టపడి నేడు గెలవబోతున్నాం అనేసరికి వేరొక వ్యక్తికి టికెట్ కేటాయించి కార్యకర్తలకు ఇబ్బందులకు గురిచేసారని ఈశ్వరి ఆవేదన చెందారు.కార్యకర్తల అభిప్రాయాలు మేరకు నేను రెబెల్ అభ్యర్థిగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఆమె ప్రకటించారు .కార్యకర్తలంతా సైనికుల వలే పనిచేసే రెబల్ గా పోటీ చేస్తున్న తనను గెలిపించి టిడిపికి గుణపాఠం చెప్పాలని ఆమె కోరారు.2014లో వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన ఈశ్వరి 2019 ఎన్నికలకు ముందు వైసీపీకి రాజీనామా చేసి టిడిపిలో చేరారు 2019లో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు.