మనము ఎంత జాగ్రత్తగా ఉన్నా పబ్లిక్ ప్రదేశాల్లో( Public Places ) మన వస్తువులను దొంగలు చోరీ చేయడం చూసే ఉంటాం.బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు లేకుండా ఏదైనా రద్దీ మార్కెట్లలో ఇలాంటి దొంగలు ఎదుటివారి విలువైన వస్తువులను చోరీ చేయడానికి కాపు కాసి ఉంటారు.
ఇకపోతే తాజాగా ఓ వ్యక్తి రైల్వే స్టేషన్లో నిద్రపోతున్నట్లు నటిస్తూ చోరీలు చేయడం ఇప్పుడు వైరల్ గా మారింది.రైల్వే స్టేషన్( Railway Station ) లో ఉన్న వెయిటింగ్ రూమ్ లో నేలపై నిద్రిస్తున్న వారి పక్కనే సాధారణ ప్రయాణికుడిగా ఓ దొంగ పడుకొని దొంగతనాలకు పాల్పడ్డాడు.ఇందుకు సంబంధించిన ఫొటోస్ అక్కడి సిసిటీవీలలో రికార్డ్ కాగా అవి కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది

ఇకపోతే ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లోని మధుర రైల్వే స్టేషన్లో( Mathura Railway Station ) చోటుచేసుకుంది.ఈ స్టేషన్లో అనేకమార్లు దొంగతనాలు జరుగుతున్నట్లు రైల్వే పోలీసులకు ప్రయాణికులు ఫిర్యాదు చేస్తుండగా.దాంతో అలర్ట్ అయిన రైల్వే పోలీసులు సిసిటీవీ ఫుటేజ్ లను పరిశీలించగా అసలు విషయం బయటపడింది.ఇక సిసిటీవీ పోలీసులను చూసిన పోలీసులు.స్టేషన్ లో ఓ వ్యక్తి నిద్రపోతున్నట్లు నటించి పలు చోరీలకు( Robberies ) పాల్పడ్డ సంఘటనలకు సంబంధించిన వీడియో రికార్డులు వారికి లభించాయి.ఇక వైరల్ అవుతున్న వీడియోలో దొంగ మొదట ఒక ప్రయాణికుడి పక్కన పడుకొని అతనిని ఎవరైనా గమనిస్తున్నారో లేదో అని వేచి చూశాడు.
ఆ తర్వాత అతడు మెల్లగా నిద్రిస్తున్న ప్రయాణికుడి దగ్గరికి వెళ్లి పడుకున్నారు నటించి ప్యాంటు జేబులోని మొబైల్ ఫోన్( Mobile Phone ) ని దొంగతనం చేశాడు.ఆపై సమీపంలో ఉన్న మరో ప్రయాణికుడు దగ్గరికి వెళ్లి అతని జోబులో నుంచి కూడా మరో మొబైల్ ఫోన్ ని చోరీ చేశాడు.
ఇక అంతే వెంటనే వారు ఉన్న వెయిటింగ్ రూమ్ నుంచి అతడు జారుకున్నాడు.

ఇక సిసిటీవీ ఫుటేజ్( CCTV ) ను పరిశీలించిన పోలీసులు చివరకు 21 ఏళ్ల అవినాష్ సింగ్ గా దొంగను గుర్తించారు.ఈ దొంగను మంగళవారం నాడు అరెస్టు చేశారు రైల్వే పోలీసులు.అతను మొత్తం రైల్వే స్టేషన్లో ఐదు మొబైల్ ఫోన్ లను చోరీ చేసినట్లుగా తెలుసుకున్న పోలీసులు కేవలం అతని దగ్గర నుంచి ఒక్క సెల్ ఫోన్ ని మాత్రమే రికవరీ చేయగలిగారు.
ఇక మిగతా మొబైల్ ఫోన్లు, ఇతర సామాగ్రి స్వాధీనం కొరకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు.







