ఈ మధ్య కాలంలో ఎంతో ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్న సెలబ్రిటీలు విడిపోతూ అభిమానులను సైతం బాధ పెడుతున్నారు.హీరో విష్ణు విశాల్, జ్వాలా గుత్తా ఒకరినొకరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
ఫస్ట్ మ్యారేజ్ బ్రేకప్ అయినప్పటికీ విష్ణు విశాల్, జ్వాలా గుత్తా ఒకరినొకరు ప్రేమించి పెళ్లి చేసుకోవడం జరిగింది.అయితే ఈ మధ్య కాలంలో విష్ణు విశాల్, జ్వాలా గుత్తా మధ్య గొడవలు జరుగుతున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ వార్తలు తన దృష్టికి కూడా రావడంతో విష్ణు విశాల్ ఈ వార్తల గురించి స్పందించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.జ్వాలా గుత్తాకు నాకు మధ్య గొడవలు జరుగుతున్నాయని అయితే ఎప్పుడు గొడవ జరిగినా మొదట కాంప్రమైజ్ అయ్యేది నేనేనని ఆయన కామెంట్లు చేశారు.
మ్యారేజ్ తర్వాత జ్వాలా గుత్తా గురించి నేను చాలా నేర్చుకుంటున్నానని విష్ణు విశాల్ పేర్కొన్నారు.

నేను కాంప్రమైజ్ అయితే జ్వాలా గుత్తా కూడా సర్దుకుంటుందని విష్ణు విశాల్ అన్నారు.ఏ ఫ్యామిలీలో అయినా అబ్బాయి రాజీ పడాలని అలా జరిగితే మాత్రం ఫ్యామిలీ సంతోషంగా ఉండటం సాధ్యమవుతుందని విష్ణు విశాల్ చెప్పుకొచ్చారు.మా అమ్మ నాన్న కూడా చాలా సందర్భాల్లో గొడవలు పడ్డారని అయితే తమ మధ్య వచ్చిన గొడవలను పరిష్కరించుకుని వాళ్లు జీవనం సాగిస్తున్నారని విష్ణు విశాల్ వెల్లడించారు.
జ్వాలా గుత్తా గతంలో ఒక సాంగ్ లో కనిపించిందని ఆ సాంగ్ లో కనిపించిన విషయంలో ఆమె ఇప్పటికీ ఫీలవుతోందని విష్ణు విశాల్ తెలిపారు.జ్వాలా గుత్తా నుంచి నాకు సహకారం ఉందని నా వృత్తిని అర్థం చేసుకుని ఆమె తన వంతు సహాయసహకారాలు అందిస్తోందని విష్ణు విశాల్ తెలిపారు.
విష్ణు విశాల్ చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.