ఎవరి దగ్గర పడుకోకుండా కూడా చాలా మంది హీరోయిన్లు అయ్యారు...

తెలుగులో పలు క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులని బాగానే అలరిస్తున్న ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ “అపూర్వ” గురించి ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే అపూర్వ మొదట్లో హీరోయిన్ కావాలని సినిమా పరిశ్రమకి వచ్చినప్పటికీ పలు కారణాల వల్ల హీరోయిన్ కాలేకపోయింది.

 Telugu Character Artist Apoorva Sensational Comments On Casting Couch, Apoorva,-TeluguStop.com

కానీ అవకాశాల కోసం ప్రయత్నిస్తూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలలో నటించే అవకాశాలు దక్కించుకుని మంచి గుర్తింపు తెచ్చుకుంది.అలాగే అప్పుడప్పుడు కొంత మేర బోల్డ్ తరహా పాత్రలలో కూడా నటించి బాగానే మెప్పించింది.

అయితే తాజాగా నటి అపూర్వ ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో పాల్గొంది.ఇందులో భాగంగా టాలీవుడ్ లో మహిళలపై జరుగుతున్న “లైంగిక వేధింపులు మరియు అవకాశాల కోసం కమిట్ మెంట్” అనే విషయంపై స్పందించింది.

అయితే ముందుగా సినిమా పరిశ్రమలో ఎవరూ కూడా ఎవరిని బలవంతం చేయరని కేవలం తమకు కమిట్మెంట్ కావాలని డైరెక్టుగా అడుగుతారని, అయితే కమిట్మెంట్ ఇవ్వడం, ఇవ్వకపోవడం అనేది పూర్తిగా తమ వ్యక్తిగత విషయమని చెప్పుకొచ్చింది.అంతే తప్ప ఎవరు కూడా కమిట్ మెంట్ల పేరుతో బలవంతంగా మీద పడి బలవంతం చేయబోరని కూడా తెలిపింది.

అయితే సినీ పరిశ్రమలో కమిట్ మెంట్లు ఇవ్వని వారు కూడా స్టార్ హీరోయిన్ గా ఎదిగారని అందుకు ఉదాహరణగా కొంత మంది హీరోయిన్ల పేర్లను కూడా తెలిపింది.అంతేగాక ఈ మధ్యకాలంలో క్యాస్టింగ్ కౌచ్ సమస్యపై పోరాటాలు చేస్తున్న వారు అవకాశాల పేరుతో మోసపోయిన వారయి ఉంటారని అందువల్లే సినిమా పరిశ్రమలో ఎదురయ్యే  కమిట్మెంట్ విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలని తాను కూడా సినిమా పరిశ్రమకు వచ్చిన మొదట్లో ఇలాంటి కమిట్మెంట్లను ఇవ్వలేక హీరోయిన్ కాలేక పోయారని తెలిపింది.

 

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube