CM Revanth Reddy : బీఆర్ఎస్ ఆమోదంతోనే విభజన చట్టం వచ్చింది..: సీఎం రేవంత్ రెడ్డి

బీఆర్ఎస్ ఆమోదంతోనే విభజన చట్టం వచ్చిందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి( Telangana CM Revanth Reddy ) అన్నారు.మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనతోనే అప్పట్లో విభజన చట్టం రూపొందించారని ఆరోపించారు.

 Telangana Cm Revanth Reddy Comments On Krishna Project Water Issue-TeluguStop.com

కేసీఆరే ఈ చట్టానికి, పుస్తకానికి రచయితని విమర్శించారు.ఇప్పుడు విభజన చట్టం వలన రాష్ట్రానికి ఏదైనా నష్టం జరిగితే దానికి కేసీఆరే( KCR ) బాధ్యులని తెలిపారు.

విభజన చట్టంలోని ప్రతీ అక్షరం తనను అడిగే రాశారని గతంలో కేసీఆర్ చెప్పారన్న విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.బీఆర్ఎస్ మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు తమపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

అలాగే కృష్ణా జలాలను( Krishna Water ) ఏపీకి 512, తెలంగాణకు 299 టీఎంసీలు కేటాయించారని తెలిపారు.తెలంగాణకు 299 టీఎంసీల నీరు చాలని గతంలో కేసీఆర్ అన్నారన్నారు.2014 లోనే ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించడానికి పునాది పడిందని పేర్కొన్నారు.ఒప్పందాలు, చట్టాలు, కేంద్రానికి ప్రాజెక్టుల అప్పగింత తతంగమంతా కేసీఆర్, హరీశ్ రావుదేనని( Harish Rao ) స్పష్టం చేశారు.

బీఆర్ఎస్( BRS ) పాపాలన్నింటినీ కాంగ్రెస్( Congress ) పై నెట్టే కుట్రలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.వారి తప్పులను కప్పి పుచ్చుకునేందుకు కేటీఆర్, హరీశ్ రావు తమపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube