Oldman Address Business : అడ్రస్ చెప్పాలంటే రూ.10 ఇవ్వాల్సిందే.. ఈ వృద్ధుడి వ్యాపారం సూపర్..

సాధారణంగా మనం ఏదైనా అడ్రస్( Address ) వెతుకుతున్నప్పుడు దుకాణదారులను అడగడం కామన్.కొందరు ఓపిక చేసుకుని అడ్రస్ చెప్తారు మరికొందరు మాత్రం తెలియదని, ముందుకు వెళ్ళమని విసుక్కుంటారు.

 Strange Business Idea Man Asking Rs 10 For Knowing The Address Viral-TeluguStop.com

అడ్రస్సులు చెప్పి చెప్పి అలసిపోయిన వారు ఇలా విసుక్కోవడంలో తప్పులేదు.అయితే అడ్రస్ అడిగే వారిని కస్టమర్లుగా చూసి, అది కూడా ఒక బిజినెస్ గా( Business ) మార్చాలని ఒక దుకాణదారుడు తెలివైన ఆలోచన చేశాడు.

డబ్బు సంపాదనకు సృష్టించిన ఈ తెలివైన మార్గం గురించి తెలుసుకొని ప్రస్తుతం నెటిజన్లు అవాక్కవుతున్నారు.ఈ వ్యక్తి “అడ్రస్ చెప్పాలంటే ముందుగా పది రూపాయలు( Ten Rupees ) ఇవ్వండి” అని తన షాప్ కి ఒక నోటీస్ బోర్డు అంటించాడు.

భారతీయులు దేనినైనా వ్యాపార అవకాశంగా మార్చుతారని దీని గురించి తెలిసిన నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

తెలివైన దుకాణదారుడికి సంబంధించిన ఫోటోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ ఎక్స్‌లో @comedibanda అకౌంట్ షేర్ చేసింది.ఈ ఫొటోలో ఒక చిన్న గుడిసె( Hut ) బయట పడుకున్న వ్యక్తిని మనం చూడవచ్చు, అతని చుట్టూ వస్తువులు ఉన్నాయి.అయితే అతని తల పైన ఉన్న బోర్డు మీద నోటీసు అందరినీ నవ్విస్తుంది.“అడ్రస్ అడగడానికి ముందు రూ.10 ఇవ్వాలి” అని ఆ బోర్డుపై రాసి ఉంది.

ఈ వ్యక్తి హ్యూమన్ జీపీఎస్‌గా( Human GPS ) విసిగిపోయి కొంత ఎక్స్‌ట్రా మనీ సంపాదించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.ఈ ఫొటోకు క్యాప్షన్ “ఇది వ్యాపారం” అని జోడించారు.దీనికి ఆన్‌లైన్‌లో చాలా ఫన్నీ కామెంట్స్ వచ్చాయి.ఒక వ్యక్తి, “గూగుల్ మ్యాప్స్ లైట్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్” అని ఈ వ్యాపారాన్ని సరదాగా అభివర్ణించారు.ఈ వ్యాపారంతో కోటీశ్వరులు అవ్వచ్చు అని ఇంకొందరు సరదాగా కామెంట్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube