మా నాన్న సినిమాలో ప్రభాస్ నటిస్తే మా కోసం అన్ని చేయాలా ?

దర్శకుడు శోభన్ ( Director Shobhan )కుమారుడిగా, సంతోష్ శోభన్( Santosh Shobhan ) తమ్ముడిగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు సంగీత్ శోభన్.గోల్కొండ హై స్కూల్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా మరియు మరికొన్ని సినిమాల్లో కూడా కనిపించిన ఈ సంగీత్ సినిమా ద్వారా ఫుల్ లెన్త్ యాక్టర్ గా ఎలివేట్ అయ్యాడు.

 Sangeeth Sobhan About Prabhas , Director Shobhan, Prabhas , Santosh Shobhan, Go-TeluguStop.com

ఇక దర్శకుడు శోభన్ గురించి మనందరికీ తెలిసిందే వర్షం బాబి వంటి సినిమాలు దర్శకత్వం వహించి అకాల మరణం పొందారు.ఆయన కుమారులు ఇద్దరు ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉండడం నిజంగా సంతోషించాల్సిన విషయం.

తండ్రి దర్శకుడిగా టాలీవుడ్ లో వరుస విజయాలు సాధిస్తే కొడుకులు ఇద్దరు హీరోలుగా ప్రస్తుతం సెటిల్ అవుతున్నారు ఇందులో సంతోష్ చాలా రోజుల క్రితమే ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.ఆయన ఏమీ మా పక్కింట్లో ఉండే వ్యక్తి కాదని అందుకే ఇప్పుడే ప్రభాస్ వరకు వెళ్లడం లేదు అని సంగీత్( Sangeeth ) అంటున్నాడు.

Telugu Shobhan, Golconda School, Lakshmipati, Mad, Prabhas, Sangeeth, Sangeeth S

అయితే సంగీత్ శోభన్ పూర్తిస్థాయి హీరోగా కాకుండా కమెడియన్ గా ప్రేక్షకులకు పరిచయం కావడం గమనించాల్సిన విషయం డైరెక్టర్ శోభన్ అన్న లక్ష్మీపతి( Lakshmipati ) కూడా తెలుగు కమెడియన్ అని కూడా మనకు తెలిసిందే.పెదనాన్న వారసుడుగా సంగీత్ కామెడీతో అదరగొడుతున్నాడు అందుకు సాక్షం మ్యాడ్ సినిమా( Mad movie ) విజయం సాధించడమే.ఈ సినిమాలో నార్నే నితిన్ హీరో అయినప్పటికీ కూడా సంగీత్ శోభన్ కి మంచి పేరు లభించింది.అయితే సంగీత మ్యాడ్ సినిమా ప్రమోషన్ టైంలో తన కుటుంబానికి సంబంధించిన మరియు ప్రభాస్ కు సంబంధించిన కొన్ని విషయాలను బయట చెప్పాడు ప్రభాస్ ని వర్షం సినిమాతో స్టార్ హీరోగా మలిచిన దర్శకుడిగా సంగీత్ తండ్రి శోభన్ కి పేరు వచ్చింది.

Telugu Shobhan, Golconda School, Lakshmipati, Mad, Prabhas, Sangeeth, Sangeeth S

అయితే శోభన్ లేని ఈ సమయంలో ప్రభాస్ తన బాధ్యతను శోభన్ కుమారుల విషయంలో మోస్తూ వచ్చారు.సంతోష్ శోభన్ సినిమాలకు ట్రైలర్ రిలీజ్ , ఆడియో ఫంక్షన్స్ కి వచ్చిన ప్రభాస్ సంగీత్ కోసం మాత్రం ఆ ఉత్సాహం చూపించలేదు.అందుకు సంగీత్ ప్రభాస్ ఎప్పుడు బిజీ గా ఉండే వ్యక్తి అని, నా తండ్రి సినిమాలో నటిస్తే నా గురించి ఆలోచించాల్సిన పని ఏముందని, ఆయన ఉన్న స్థాయిలో ప్రతి సారి టైం ఇవ్వడం కుదరదు అంటూ మీడియా కు చురకలు అంటించాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube