తన రాజకీయ ప్రత్యర్ధి తెలుగుదేశం పార్టీ విషయంలో జగన్ ఎక్కడ కనికరం చూపించే ఈ విధంగా కనిపించడం లేదు.వైసిపి ప్రతిపక్షంలో ఉన సమయంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ వ్యవహరించిన తీరును జగన్ పదే పదే గుర్తు చేసుకుంటున్నారు.
అప్పట్లో వైసీపీ నాయకులను టార్గెట్ చేసుకుని వెంటాడి, వేధించి వారిపై అక్రమ కేసులు బనాయించడం, ఆర్థికంగా మానసికంగా దెబ్బ తీయడం ఇలా ఎన్నో పరిణామాలను తట్టుకుని ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చింది.అధికారంలోకి వచ్చిన వెంటనే వైసిపి టిడిపి నాయకులు అందరినీ టార్గెట్ చేసుకుని వారిని జైలుకు పంపిస్తారని చంద్రబాబుతో సహా ఆ పార్టీ నాయకులు అందరూ జైలులో చిప్ప కూడు తినాల్సిందే అని అంతా అంచనా వేశారు.
కానీ దానికి భిన్నంగా జగన్ ఎన్నికల హామీలను నెరవేర్చడం, ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేయడం, మొత్తం పూర్తి దృష్టి అంతా సంక్షేమ పథకాల కే కేటాయించారు.

జగన్ పాత విషయాలను పూర్తిగా మర్చిపోయారు అని మొత్తం జనరంజక పాలన అందించే విధంగా ముందుకు వెళుతున్నారని అంతా భావించారు కానీ ఆ తర్వాత అప్పటి టిడిపి ప్రభుత్వంలో ఎన్నో అవినీతి వ్యవహారాలు చోటుచేసుకున్నాయి అని, వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టారు.అలాగే వైసిపి ప్రతిపక్షంలో ఉన్న సమయంలో తనను వేధించిన అప్పటి టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలను, అలాగే అధికారులను అందరిని మర్చిపోకుండా ఒక లిస్టు తయారు చేసుకున్నట్లు తెలుస్తోంది.ఆ లిస్టు ఆధారంగానే చేసుకుని వారి అవినీతి వ్యవహారాలను బయటకు తీసి వారికి తగిన ప్రతీకారం తో కూడిన పనిష్మెంట్ ఇస్తున్నట్లు కనిపిస్తోంది.
ప్రస్తుతం అరెస్టయిన టిడిపి కీలక నాయకుడు మాజీ మంత్రి అచ్చెన్న ఒక్కడితోనే జగన్ వదిలిపెట్టేలా కనిపించడం లేదు.మొత్తం టిడిపి కీలక నాయకులు, చివరికి చంద్రబాబు తో సహా అందరి అవినీతి ని బయట పెట్టి ప్రజల ముందు దోషిగా నిలబెట్టి , ఆ తర్వాత వారు ఓ ఊచలు లెక్క పెట్టే విధంగా చేయాలి అనేది జగన్ ఆలోచనగా తెలుస్తోంది.

ఏపీ ఫైబర్ నెట్ వ్యవహారంలో టిడిపి అక్రమాలకు పాల్పడుతోందని అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న వైసిపి పెద్ద ఎత్తున విమర్శలు చేసింది.ముఖ్యంగా ఆ వ్యవహారంలో నారా లోకేష్ పాత్ర ఎక్కువ అనేది వైసిపి ఆధారాలు సంపాదించింది.దానిపైన పూర్తి స్థాయి విచారణకు ఆదేశించిన క్రమంలో లోకేష్ ను కూడా త్వరలోనే అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.లోకేష్ తో పాటు , అప్పట్లో కీలకంగా వ్యవహరించిన ఎమ్మెల్యేలు, మంత్రులు, చంద్రబాబుతో సహా అందర్నీ అరెస్టు చేసేందుకు రంగ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.