ఏపీ రాజకీయాలు మరోసారి వేడెక్కనున్నట్టు తెలుస్తోంది.రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి తెలుగుదేశం పార్టీ నానా తంటాలు పడుతోంది.
అయితే, ప్రతిపక్షానికి అధికారం దక్కకుండా ఉండేందుకు సీఎం జగన్ కూడా అదే రేంజ్‌లో ప్రణాళికలు రచిస్తున్నారని తెలుస్తోంది.ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో టీడీపీ అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి బలమైన అభ్యర్థులు లేకుండా వైసీపీ తమ పార్టీలోకి లాక్కుంటోంది.
ఇప్పటికే టీడీపీ నుంచి పలువురు బీజేపీ, వైసీపీలో చేరారు.మరికొంత మందిని లాగేస్తే అభ్యర్థులు లేక టీడీపీ ఓటమి ఖాయమని జగన్ భావిస్తున్నారట.
టార్గెట్ జేసీ బ్రదర్స్.
తాజాగా అనంతపురం జిల్లాలో చాలా పవర్ ఫుల్ అయిన జేసీ బ్రదర్స్‌ను వైసీపీలోకి ఆహ్వానించాలని వైఎస్ జగన్ అనుకుంటున్నట్టు తెలుస్తోంది.వారు రానియెడల వారి తనయులను లాగాలని చూస్తోంది.గత ఎన్నికల్లో జేసీ బ్రదర్స్ రాజకీయాల నుంచి తప్పుకుని వారి వారసులకు టీడీపీ నుంచి టిక్కెట్లు ఇప్పించుకున్నారు.కానీ జగన్ ప్రభంజనం ముందు వారు ఓడిపోయారు.అయితే, తాడిపత్రి మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం జేసీ ప్రభాకర్ తనయుడు అస్మిత్ రెడ్డి గెలిచి చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు.
దీని వెనుక వైసీపీ హస్తం ఉందని కూడా వార్తలు వస్తున్నాయి.గతంలో అస్మిత్ రెడ్డి వైసీపీలో చేరేందుకు పావులు కదపగా.జేసీ బ్రదర్స్ అతన్ని అడ్డుకున్నారని తెలిసింది.ఇక అస్మిత్ రెడ్డి తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ అయ్యాక అధికార పార్టీని వారు విమర్శించడం కూడా తగ్గించారట.ఎందుకంటే అస్మిత్ రెడ్డి గెలుపునకు వైసీపీ కూడా సాయం చేసిందని నియోజకవర్గంలో టాక్ వినిపిస్తోంది.
తాజాగా అస్మిత్ రెడ్డి మరోసారి వైసీపీతో టచ్ లోకి వెళ్లారని తాడేపల్లి వర్గాలు అంటున్నాయి.ఇప్పటికే రెండు దఫాలుగా కీలక నేతలతో ఆయన చర్చలు కూడా జరిపారని తెలుస్తోంది.వచ్చే ఎన్నికల్లో తాడిపత్రి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేందుకు జగన్ సూత్రప్రాయంగా అంగీకరించాడని అంటున్నారు.
త్వరలోనే వైసీపీలోకి అస్మిత్ రెడ్డి వెళ్లే అవకాశం ఉన్నట్టు తెలుస్తుండగా.జేసీ ఫ్యామిలీ మాత్రం దీనికి ఒప్పుకోవడం లేదట.
కుటుంబం మొత్తం ఓకే రాజకీయ పార్టీలో ఉండాలని వారు తమ కుమారులను కంట్రోల్‌లో పెడుతున్నట్టు సమాచారం.