వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా తరచూ వార్తల్లో నిలిచే శ్రీరెడ్డి సీఎం జగన్ వ్యతిరేకంగా మాట్లాడితే ధీటుగా కౌంటర్లు ఇస్తారనే సంగతి తెలిసిందే.ఈ మధ్య కాలంలో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజును శ్రీరెడ్డి ఎక్కువగా టార్గెట్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.
శ్రీరెడ్డి రఘురామ కృష్ణంరాజు మధ్య మాటల యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే.అయితే తాజాగా రఘురామ కృష్ణంరాజును పోలీసులు ఒక కేసులో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
శ్రీరెడ్డి రఘురామ కృష్ణంరాజును ను టార్గెట్ చేస్తూ ఫేస్ బుక్ లో మరో పోస్ట్ పెట్టారు.ఆ పోస్ట్ లో శ్రీరెడ్డి తన వల్ల దేశానికి ఎటువంటి నష్టం జరగలేదని పేర్కొన్నారు.
తనను ట్రోల్ చేయాలని అనుకోవడం మీ విచక్షణకే వదిలేస్తున్నానని శ్రీరెడ్డి వెల్లడించారు.రఘురామ కృష్ణంరాజు దొంగ అని నమ్మక ద్రోహి అని, రాజద్రోహి అని, విద్రోహక శక్తి అని శ్రీరెడ్డి పేర్కొన్నారు.
రఘురామ కృష్ణంరాజుపై జాలి చూపిస్తున్న వారిని ఏమనాలో మీ విచక్షణకే వదిలేస్తున్నానని ఆమె చెప్పారు.

జగన్ ను తప్పుబడితే మీ నాశనాన్ని మీరు కోరుకుంటున్నట్టేనని శ్రీరెడ్డి వెల్లడించారు. సీఎం జగన్ పై వ్యతిరేకంగా పోస్టులు పెట్టేవాళ్లకు, కామెంట్లు చేసేవాళ్లకు శ్రీరెడ్డి పరోక్షంగా వార్నింగ్ ఇవ్వడం గమనార్హం శ్రీరెడ్డి పోస్ట్ పై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. క్యాస్టింగ్ కౌచ్ వివాదం తరువాత శ్రీరెడ్డి సినిమాల కంటే సోషల్ మీడియా పోస్టుల ద్వారానే వార్తల్లో నిలుస్తున్నారు.
గతంలో శ్రీరెడ్డి కొంతమంది స్టార్, మిడిల్ రేంజ్ హీరోలను ఎక్కువగా టార్గెట్ చేశారు.ఒకప్పుడు సినీ ప్రముఖులపైనే విమర్శలు చేసిన శ్రీరెడ్డి ప్రస్తుతం రాజకీయ ప్రముఖులపై కూడా విమర్శలు చేస్తుండటం గమనార్హం.
భవిష్యత్తులో శ్రీరెడ్డి రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇస్తారేమో చూడాల్సి ఉంది.