నందమూరి బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ మూడో సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్ళబోతుంది.ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది.
ఈ సినిమాలో కూడా బాలయ్యబాబు ద్విపాత్రాభినయం చేస్తున్నాడు.ఇక ఈ సినిమాలో బాలయ్య ఒక పాత్రలో అఘోరాగా కనిపించబోతున్నాడు.
ఇదిలా ఉంటే లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగ్ వాయిదా పడింది.ఇక ఈ సినిమాలో లాక్ డౌన్ కి ముందు అనుకున్న కథ ప్రకారం కామెడీ ట్రాక్ కూడా పెట్టడం జరిగింది.
ఇక ఈ కామెడీ ట్రాక్ కోసం గతంలో బ్రహ్మానందంని ఎక్కువగా ఉపయోగించుకున్నాడు.
అయితే ఈ సారి సునిల్ ని కామెడీ ట్రాక్ కోసం బోయపాటి ఫైనల్ చేశాడు.
హీరో ఫెయిల్ అవడంతో మరల కమెడియన్ గా స్టార్ హీరోల సినిమాలలో సునీల్ అవకాశాలు సొంతం చేసుకుంటున్నాడు.అయితే లాక్ డౌన్ తర్వాత కథలో కీలక మార్పులు చేయడంతో సినిమాలో కామెడీ ట్రాక్ మొత్తం లేపెసినట్లు తెలుస్తుంది.
ఈ నేపధ్యంలో సునీల్ పాత్రని లేపెసినట్లు తెలుస్తుంది.ఈ నేపధ్యంలో ఈ సినిమా నుంచి సునీల్ కూడా అవుట్ అయిపోయినట్లు సమాచారం.ఇక సినిమా కంటెంట్ బట్టి కాస్తా సబ్జెక్ట్ లో కామెడీ ట్రాక్ పెడితే డీవియేట్ చేసినట్లు అవుతుందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.