జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెనక కీలక రాజకీయ మంత్రాగం నడిపే ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ కొద్ది రోజులుగా పార్టీ కార్యక్రమాల్లో కనిపించకపోవడం చర్చనీయాంశమైంది.పార్టీని, పవన్‌ను ముందుండి నడిపించే మనోహర్ కొంత కాలంగా మౌనంగా ఉండడంతో ఎవరికి తోచినట్టు వారు అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
పవన్ సినిమాల్లో బిజీగా ఉండడంతో నిన్న మొన్నటి వరకు మనోహర్ ఇప్పుడు ఆ చొరవ తీసుకోవడం లేదంటున్నారు.
నాదెండ్ల మౌనంగా ఉండడంతో పార్టీ కార్యకర్తల్లో అమోమయం నెలకొంది.
ఇప్పటికే పవన్ పూర్తిగా సినిమాలకే అంకితం కావడంతో గందరగోళంలో పడ్డ జనసేన శ్రేణులు ఇప్పుడు మనోహర్ కూడా పార్టీ కార్యకలాపాలను పట్టించుకోకపోవడంతో మరింత డీలా పడిపోయారు.ప్రస్తుతం మనోహర్ కీలకమన పొలిటికల్ వ్యవహారాల కమిటీ అధ్యక్షుడిగా ఉన్నారు.
కొద్ది రోజుల క్రితం అమరావతిలో ఒక రోజు పర్యటించిన మనోహర్ ఆ తర్వాత ఏ విషయంలోనూ స్పందించడం లేదు.

జనసేనతో భవిష్యత్ లేదని డిసైడ్ అయిన మనోహర్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పేందుకు రంగం సిద్ధమైందంటున్నారు.బీజేపీతో పొత్తు పెట్టుకున్నా కూడా పార్టీకి క్రేజ్, ఊపు రావడం లేదు.ఇప్పటికే రెండు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ఆయన జనసేనను నమ్ముకుంటే వచ్చే ఎన్నికల్లోనూ ఓడిపోవడం ఖాయమే అన్న నిర్ణయానికి వచ్చేశారట.
ఈ క్రమంలోనే ఆయన సైలెన్స్ వెనక ఆయన పార్టీ మారేందుకు రెడీ అవుతున్నారన్న గుసగుసలు వస్తున్నాయి.
ఈ వార్తలపై ఆయన కూడా స్పందించకపోవడంతో నాదెండ్ల పార్టీ మార్పు ఖాయమే అంటున్నారు.
ఆయన బీజేపీలో చేరేందుకు ఆసక్తితో ఉన్నట్టు భోగట్టా.! అటు బీజేపీ వాళ్లు కూడా ఆయన్ను పార్టీలోకి తీసుకునేందుకు రెడీగానే ఉన్నారట.
వాస్తవానికి గత ఎన్నికలకు ముందు ఆయనకు వైసీపీ ఆఫర్ వచ్చింది.అయితే తన నియోజకవర్గం అయిన తెనాలి కాకుండా పొన్నూరు సీటు ఇస్తామని పెండింగ్ పెట్టడంతో ఆయన జనసేన నుంచి తెనాలిలో పోటీ చేసి ఓడిపోయారు.