జగన్ గురించి తెలిసినా ...! వారు రిస్క్ చేస్తున్నారా ? 

జగన్ గురించి అందరికి బాగా తెలుసు.ఏ విషయంలోనూ ఆయన వెనక్కి తగ్గే మనస్తత్వం కాదు.

 Ap Job Unions Ready To Take Up Concern For Prc Despite Knowing About Jaga - Ap N-TeluguStop.com

కష్టమైనా,  నష్టమైనా ముందుకు దూసుకు వెళుతూ ఉంటారు .ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటారు.దీని కారణంగా తనకు,  తమ పార్టీకి డ్యామేజ్ జరిగినా,  జగన్ ఏ మాత్రం లెక్కచేయరు.మొదటి నుంచి ఇదే వైఖరితో ఉంటూ వస్తున్నారు.ఆ మొండి వైఖరే ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చేందుకు కారణమైంది.  బలమైన రాజకీయ వ్యవస్థలను ఎదుర్కొని మరి జగన్ నిలబడగలుగుతున్నారు.

ప్రధాన ప్రతిపక్షం టీడీపీ తో పాటు,  ఆ పార్టీ అనుకూల మీడియా ఎదురుదాడి చేస్తున్న,  జగన్ అవి లెక్క చేయకుండా తనదైన శైలిలో ముందుకు దూసుకెళ్తున్నారు.

అయినా జగన్ కు ఎన్నో రకాల ఇబ్బందులు ఎదురవుతూనే వస్తున్నాయి.

తాజాగా ఉద్యోగ సంఘాలు జగన్ కు అల్టిమేటం జారీ చేశాయి.పిఏసీ విషయం లో తమ డిమాండ్లను తీర్చాలని జగన్ పట్టుబడుతున్నారు.

అయితే దీనిపై ఇప్పటికే జగన్ క్లారిటీ ఇచ్చారు.  పదిరోజుల్లో పీఆర్సీ నివేదిక వస్తుందని,  అప్పటి వరకు ఓపిక పట్టాలి అంటూ తనను కలిసిన ఉద్యోగ సంఘాల నేతలతో ఆయన చెప్పారు.

  అయితే జగన్ మాట పై నమ్మకం లేని కొంతమది ఉద్యోగ సంఘాల నాయకులు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.దీంతో ఉద్యోగ సంఘాల్లో ఇప్పుడు చీలిక వచ్చేలా కనిపిస్తోంది.

ఎందుకంటే జగన్ సంగతి ఉద్యోగ సంఘాలకు బాగా తెలుసు.  జగన్ ను బతిమిలాడి తమ డిమాండ్లను తీర్చుకోవాలి తప్ప , ఆయన బ్లాక్ మెయిల్ చేస్తే అస్సలు లెక్క చేసే వ్యక్తి కాదు.

  జనాల నుంచి ఈ విషయంలో తమపై సానుభూతి ఉండదనే విషయం ఉద్యోగ సంఘాల నేతలకు బాగా తెలుసు.పొరుగునే ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె విషయంలో దాదాపు నెల రోజులకు పైగా ఆర్టీసీ కార్మికులు విధులకు దూరంగా ఉన్నా,  కేసీఆర్ ఏమాత్రం లెక్క చేయలేదు.

ఉద్యోగులే దిగి వచ్చి ప్రభుత్వాన్ని బతిమిలాడుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఉద్యోగ సంఘాల నేతలే  గుర్తు చేసుకుంటున్నారు.అయితే ఉద్యోగ సంఘాల నేత బండి శ్రీనివాసరావు మాత్రం ప్రభుత్వాన్ని కూల్చేస్తా అంటూ స్టేట్మెంట్లు ఇవ్వడం తో కొంత మంది ఉద్యోగ సంఘాల నేతలు ఆందోళన చెందుతున్నారు.

  బెదిరింపులకు జగన్ భయపడే రకం కాదని,  ప్రజలలోనూ తమకు ఇబ్బందులు ఏర్పడతాయని, పైగా ఒక పార్టీకి అనుకూలంగా ఈ విమర్శలు చేస్తున్నారు అనే అభిప్రాయం ప్రజల్లోకి వెళితే,  ప్రజల నుంచి సానుభూతి దక్కకపోగా, అనవసర చిక్కుల్లో పడతామని ఆందోళన చెందుతున్నారట.అయినా జగన్ పదిరోజుల్లో సమస్య తీర్చుతామని హామీ ఇచ్చిన తర్వాత కూడా వేచి చూడకుండా ఆందోళన ఉధృతం చేస్తే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందనే ఆందోళన ఉద్యోగ సంఘాల నేతలలోనూ కనిపిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube