ఏపీ ప్రభుత్వం మద్యం ప్రియులకు షాకింగ్ న్యూస్ తెలిపింది.మద్యాన్ని దశలవారీగా నిషేధించాలని ప్రభుత్వం కంకణం కట్టుకుంది.
ఆ దిశగా అఢుగులు కూడా వేస్తోంది.మద్యం దుకాణాలను నిర్వహిస్తూ మెల్లిమెల్లిగా షాపుల సంఖ్యను తగ్గిస్తోంది.
అయితే ఇతర రాష్ట్రాల నుంచి ప్రస్తుతం మూడు మద్యం సీసాలను తీసుకొచ్చేందుకు ప్రభుత్వ అనుమతి ఉంది.ప్రస్తుతం ఆ అవకాశం కూడా లేకుండా చట్ట సవరణ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోంది.
ఈ మేరకు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది.రాష్ట్రంలో నుంచి ప్రతి వ్యక్తి మూడు మద్య సీసాల కంటే ఎక్కువగా నిల్వ చేసుకోవద్దని గతంలో ఎక్సైజ్ శాఖ వెల్లడించింది.
దీంతో ఏపీ రాష్ట్ర ప్రజలు పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, తమిళనాడు, ఒడిశా, కర్ణాటకల నుంచి మద్యం దిగుమతి చేసుకుంటున్నారు.విషయం తెలిసి స్పెషల్ ఎన్‌ఫోర్స్ మెంట్ బ్యూరో విచారణ చేపట్టింది.
ఈ వ్యవహారం కాస్త హైకోర్టు వరకు వెళ్లింది.ప్రభుత్వమే గరిష్టంగా మూడు మద్యం సీసాలను ఉంచుకోవచ్చని స్పష్టం చేసిందని, అది ఏ రాష్ట్రం నుంచి తెచ్చుకున్నా నేరం కాబోదని హైకోర్టు కూడా స్పష్టం చేసింది.
గతంలో ఈ అంశంపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.ఎక్కడి నుంచైనా మూడు మద్యం సీసాలను తెచ్చుకోవచ్చని చెప్పుంది.హైకోర్టు తీర్పుతో పొరుగు రాష్ట్రాల నుంచి తీసుకొచ్చే వారి సంఖ్య పెరిగిందని ఎక్సైజ్ శాఖ పేర్కొంది.పక్క రాష్ట్రాల్లో తక్కువ ధరకు మద్యం కొనుగోలు చేసి, ఇళ్లల్లో నిల్వ ఉంచుకుంటున్నారని ఆరోపించింది.
వ్యాపారం చేసుకునే వారి సంఖ్య కూడా పెరిగిందని ఎక్సైజ్ శాఖ గుర్తించింది.దీంతో మూడు సీసాల నిబంధనలో చట్ట సవరణ చేయాలని, పొరుగు రాష్ట్రాల నుంచి తెచ్చుకునే మద్యంపై అదనపు పన్నులను వేయాలని నిర్ణయించింది.
దీంతో మద్యం ధరలు సమానం అవుతాయని అధికారులు ప్రతిపాదించారు.ఈ సమస్యపై త్వరలో ప్రతిపాదన పంపిస్తామని, ఏ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుదో వేచి చూడాలని ఎక్సైజ్ అధికారులు పేర్కొంటున్నారు.