TDP Janasena : టీడీపీ జనసేన సీట్ల పంపకాలు .. గోదావరి జిల్లాల నేతల్లో టెన్షన్ 

ప్రాథమికంగా టిడిపి ,జనసేన( TDP Janasena ) పార్టీల మధ్య సీట్ల పంపకాల విషయంలో ఒక క్లారిటీకి వచ్చారు .ఆ రెండు పార్టీల అధినేతలు.

 Tdp Janasena Seat Distribution Tension Among The Leaders Of Godavari Districts-TeluguStop.com

పొత్తులో భాగంగా జనసేనకు ఎన్ని సీట్లు కేటాయించాలి ?  ఏ నియోజకవర్గాలను కేటాయించాలనే విషయంలో ఇప్పటికే టిడిపి అధినేత చంద్రబాబు( Chandrababu ) ఓ నిర్ణయం తీసుకున్నారు.ఆ సీట్ల విషయంలో పవన్( Pawan Kalyan ) కొన్ని స్థానాల్లో జనసేనకు సీట్లు కేటాయించేందుకు టిడిపి అధినేత చంద్రబాబు సానుకూలంగానే స్పందించారు .అయితే అధికారికంగా మాత్రం ఏ నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేస్తుందనేది క్లారిటీ రాలేదు.అయితే జనసేన ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలో( Godavari Districts ) వీలైనంత ఎక్కువ సీట్లు తీసుకుని , అక్కడ నుంచి తమ పార్టీ అభ్యర్థులను పోటీకి దింపితే ఫలితాలు సానుకూలంగా ఉంటాయని అంచనా వేస్తున్నారు.

అయితే టిడిపి సైతం ఇదే జిల్లాల నుంచి తమకు మెజారిటీ స్థానాలు దక్కుతాయని అంచనాలో ఉంది.వాస్తవంగా ఉమ్మడి తూర్పు,  పశ్చిమగోదావరి జిల్లాలో ఏ పార్టీకి ఎక్కువ స్థానాలు వస్తే ఆ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం గా ఉంది.

అందుకే అన్ని పార్టీలు గోదావరి జిల్లాలో పట్టు కోసం ప్రయత్నిస్తూ ఉంటాయి.

Telugu Ap, Datla Buchibabu, Janasena, Janasena Mla, Kandula Durgesh, Pavan Kalya

ఇక్కడే జనసేన, టిడిపి మధ్య సీట్ల పంపకాలు విషయంలో తమ అధినేతలు ఏ నిర్ణయం తీసుకున్నారు అనేది క్లారిటీ లేకపోవడంతో,  చాలా నియోజకవర్గాల్లో ఈ వ్యవహారం రచ్చ రచ్చ అయ్యేలా పరిస్థితి కనిపిస్తోంది.ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలో జనసేన ఎక్కువ సీట్లు ఆశిస్తూ ఉండడంతో,  ఆ సీట్లపై ఆశలు పెట్టుకున్న టిడిపి నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ,  ఆ సీటు తమదే అంటూ బల ప్రదర్శనకు దిగుతున్నారు.2019 ఎన్నికల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 14 శాతం జనసేన ఓట్లు సాధించింది.ఇదే జిల్లాలోని రాజోలు నియోజకవర్గం సీటును గెలుచుకుంది.దీంతో ఈ జిల్లాలో కనీసం 8 స్థానాలనైనా జనసేనకు కేటాయించాలని పవన్ చంద్రబాబు వద్ద ప్రతిపాదన చేశారట .

Telugu Ap, Datla Buchibabu, Janasena, Janasena Mla, Kandula Durgesh, Pavan Kalya

అలాగే కాకినాడ రూరల్ ,( Kakinada Rural ) పిఠాపురం,( Pithapuram )  రాజమండ్రి రూరల్ , ముమ్మిడివరం సీట్లు ఈ జాబితాలో ఉన్నట్లుగా జనసేన వర్గాలు పేర్కొంటున్నాయి .అలాగే కొత్తపేట , రామచంద్రపురం వంటి స్థానాల్లోనూ జనసేన తరఫున పోటీ చేసేందుకు అక్కడి నాయకులు జనాల్లోకి వెళ్తున్నారు.అయితే జనసేన ఆశిస్తున్న స్థానాల్లో టిడిపి నుంచి బలమైన నాయకులే ఉండడంతో , వారి విషయంలో చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఉత్కంఠ కలిగిస్తోంది.  ముఖ్యంగా రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి( Gorantla Butchaiah Chowdary ) ఉన్నారు.

ఆ స్థానాన్ని జనసేన కీలక నేత కందుల దుర్గేష్ కు( Kandula Durgesh ) కేటాయించాలని భావిస్తున్నారు.అలాగే పిఠాపురంలో మాజీ ఎమ్మెల్యే వర్మ కూడా క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేస్తూ వస్తూ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు .ఒకవేళ పొత్తులో భాగంగా జనసేన అభ్యర్థి టీ టైం ఉదయ్ శ్రీనివాస్ కు ఈ స్థానాన్ని కేటాయిస్తే రెబల్ గా పోటీ చేసేందుకు వర్మ ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం.

Telugu Ap, Datla Buchibabu, Janasena, Janasena Mla, Kandula Durgesh, Pavan Kalya

ముమ్మిడివరంలో మాజీ ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు( Datla Buchibabu ) వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు అయితే ఈ సీటునూ జనసేన ఆశిస్తూ ఉండడంతో,  బుచ్చి బాబు పరిస్థితి ఏమిటనేది ప్రశ్నార్ధకంగా మారింది.అయితే కొన్ని నియోజకవర్గాల్లో జనసేన టిడిపి మధ్య ఆధిపత్య పోరు తీవ్రంగా నడుస్తుండడంతో,  ఇక్కడ ఎవరికి సీటు కేటాయించినా,  మరొకరు వ్యతిరేకంగా పనిచేసే అవకాశం ఉండడంతో ఈ విషయంలో రెండు పార్టీల అధినేతలు ఏ విధంగా తమ పార్టీల నేతలను బుజ్జగిస్తారు.  ఏ విధంగా సీట్ల కేటాయింపు చేపడుతారనేది అందరికీ ఉత్కంఠ కలిగిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube