ఏపీ రాష్ట్ర ప్రయోజనాల కోసమే పొత్తులని జనసేన అధినేత పవన్ కల్యాణ్( Pawan Kalyan ) అన్నారు.పొత్తులపై పార్టీ విధానాలకు భిన్నంగా వ్యాఖ్యలు వద్దని చెప్పారు.
జనహితం, రాష్ట్ర సమగ్ర అభివృద్ధికే జనసేన( Janasena ) ప్రథమ ప్రాధాన్యమని పేర్కొన్నారు.
ఏపీ సమగ్రాభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం పొత్తులతో ముందుకెళ్తున్నామని తెలిపారు. పొత్తుకు విఘాతం కలిగించాలని ఎవరూ ప్రయత్నించ వద్దని సూచించారు.వచ్చే ఎన్నికల్లో పొత్తులతోనే ముందుకు వెళ్తున్నామన్న సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.