TDP Janasena : టీడీపీ జనసేన సీట్ల పంపకాలు .. గోదావరి జిల్లాల నేతల్లో టెన్షన్
TeluguStop.com
ప్రాథమికంగా టిడిపి ,జనసేన( TDP Janasena ) పార్టీల మధ్య సీట్ల పంపకాల విషయంలో ఒక క్లారిటీకి వచ్చారు .
ఆ రెండు పార్టీల అధినేతలు.పొత్తులో భాగంగా జనసేనకు ఎన్ని సీట్లు కేటాయించాలి ? ఏ నియోజకవర్గాలను కేటాయించాలనే విషయంలో ఇప్పటికే టిడిపి అధినేత చంద్రబాబు( Chandrababu ) ఓ నిర్ణయం తీసుకున్నారు.
ఆ సీట్ల విషయంలో పవన్( Pawan Kalyan ) కొన్ని స్థానాల్లో జనసేనకు సీట్లు కేటాయించేందుకు టిడిపి అధినేత చంద్రబాబు సానుకూలంగానే స్పందించారు .
అయితే అధికారికంగా మాత్రం ఏ నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేస్తుందనేది క్లారిటీ రాలేదు.
అయితే జనసేన ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలో( Godavari Districts ) వీలైనంత ఎక్కువ సీట్లు తీసుకుని , అక్కడ నుంచి తమ పార్టీ అభ్యర్థులను పోటీకి దింపితే ఫలితాలు సానుకూలంగా ఉంటాయని అంచనా వేస్తున్నారు.
అయితే టిడిపి సైతం ఇదే జిల్లాల నుంచి తమకు మెజారిటీ స్థానాలు దక్కుతాయని అంచనాలో ఉంది.
వాస్తవంగా ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలో ఏ పార్టీకి ఎక్కువ స్థానాలు వస్తే ఆ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం గా ఉంది.
అందుకే అన్ని పార్టీలు గోదావరి జిల్లాలో పట్టు కోసం ప్రయత్నిస్తూ ఉంటాయి. """/" /
ఇక్కడే జనసేన, టిడిపి మధ్య సీట్ల పంపకాలు విషయంలో తమ అధినేతలు ఏ నిర్ణయం తీసుకున్నారు అనేది క్లారిటీ లేకపోవడంతో, చాలా నియోజకవర్గాల్లో ఈ వ్యవహారం రచ్చ రచ్చ అయ్యేలా పరిస్థితి కనిపిస్తోంది.
ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలో జనసేన ఎక్కువ సీట్లు ఆశిస్తూ ఉండడంతో, ఆ సీట్లపై ఆశలు పెట్టుకున్న టిడిపి నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఆ సీటు తమదే అంటూ బల ప్రదర్శనకు దిగుతున్నారు.
2019 ఎన్నికల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 14 శాతం జనసేన ఓట్లు సాధించింది.
ఇదే జిల్లాలోని రాజోలు నియోజకవర్గం సీటును గెలుచుకుంది.దీంతో ఈ జిల్లాలో కనీసం 8 స్థానాలనైనా జనసేనకు కేటాయించాలని పవన్ చంద్రబాబు వద్ద ప్రతిపాదన చేశారట .
"""/" /
అలాగే కాకినాడ రూరల్ ,( Kakinada Rural ) పిఠాపురం,( Pithapuram ) రాజమండ్రి రూరల్ , ముమ్మిడివరం సీట్లు ఈ జాబితాలో ఉన్నట్లుగా జనసేన వర్గాలు పేర్కొంటున్నాయి .
అలాగే కొత్తపేట , రామచంద్రపురం వంటి స్థానాల్లోనూ జనసేన తరఫున పోటీ చేసేందుకు అక్కడి నాయకులు జనాల్లోకి వెళ్తున్నారు.
అయితే జనసేన ఆశిస్తున్న స్థానాల్లో టిడిపి నుంచి బలమైన నాయకులే ఉండడంతో , వారి విషయంలో చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఉత్కంఠ కలిగిస్తోంది.
ముఖ్యంగా రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి( Gorantla Butchaiah Chowdary ) ఉన్నారు.
ఆ స్థానాన్ని జనసేన కీలక నేత కందుల దుర్గేష్ కు( Kandula Durgesh ) కేటాయించాలని భావిస్తున్నారు.
అలాగే పిఠాపురంలో మాజీ ఎమ్మెల్యే వర్మ కూడా క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేస్తూ వస్తూ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు .
ఒకవేళ పొత్తులో భాగంగా జనసేన అభ్యర్థి టీ టైం ఉదయ్ శ్రీనివాస్ కు ఈ స్థానాన్ని కేటాయిస్తే రెబల్ గా పోటీ చేసేందుకు వర్మ ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం.
"""/" /
ముమ్మిడివరంలో మాజీ ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు( Datla Buchibabu ) వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు అయితే ఈ సీటునూ జనసేన ఆశిస్తూ ఉండడంతో, బుచ్చి బాబు పరిస్థితి ఏమిటనేది ప్రశ్నార్ధకంగా మారింది.
అయితే కొన్ని నియోజకవర్గాల్లో జనసేన టిడిపి మధ్య ఆధిపత్య పోరు తీవ్రంగా నడుస్తుండడంతో, ఇక్కడ ఎవరికి సీటు కేటాయించినా, మరొకరు వ్యతిరేకంగా పనిచేసే అవకాశం ఉండడంతో ఈ విషయంలో రెండు పార్టీల అధినేతలు ఏ విధంగా తమ పార్టీల నేతలను బుజ్జగిస్తారు.
ఏ విధంగా సీట్ల కేటాయింపు చేపడుతారనేది అందరికీ ఉత్కంఠ కలిగిస్తోంది.
కొత్త ఆఫర్లకు నో చెబుతున్న ప్రభాస్ బ్యూటీ.. ప్రభాస్ వల్లే ఈ సమస్య ఎదురైందా?