నీ స్థాయిని దిగజార్చుకుంటున్నావ్‌ అంటూ సూర్యపై సోషల్‌ మీడియాలో ట్రోల్స్‌

తమిళ ఆడియన్స్ తో పాటు దేశ వ్యాప్తంగా సూర్యకు ఉన్న అభిమానులు సోషల్‌ మీడియాలో ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.కొందరు మరీ కఠువుగా ట్రోల్స్ చేస్తున్నారు.

 Tamil Hero Surya Gets Trolls On Social Media About Jai Bhim-TeluguStop.com

తనకు తానుగా తన స్థాయిని దిగజార్చుకునేలా ఆయన నిర్ణయాలు ఉంటున్నాయి అంటూ సూర్య అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.సూర్య డబ్బుల కోసం ఇలా చేస్తున్నాడు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తుంటే మరి కొందరు మాత్రం సూర్య పనైపోయిందా అన్నట్లుగా కామెంట్స్‌ చేస్తున్నారు.

మొత్తానికి సూర్యను స్వయంగా అభిమానులు ఏకి పారేస్తున్నారు.ఆయన్ను ఇంతగా ట్రోల్‌ చేయడంకు కారణం ఆయన తాజాగా నటిస్తున్న జై భీమ్‌ సినిమా.

 Tamil Hero Surya Gets Trolls On Social Media About Jai Bhim-నీ స్థాయిని దిగజార్చుకుంటున్నావ్‌ అంటూ సూర్యపై సోషల్‌ మీడియాలో ట్రోల్స్‌-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సూర్య లాయర్‌ గా కనిపించబోతున్న జై భీమ్‌ సినిమా ఫస్ట్‌ లుక్‌ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఆ సినిమాకు సంబంధించిన లుక్ విడుదల అయినప్పటి నుండి అంచనాలు పీక్స్ కు వెళ్లి పోతున్నాయి.

జై భీమ్‌ సినిమాలో ఒక గిరిజన మహిళ కోసం న్యాయ పోరాటం చేసే లాయర్ పాత్రలో సూర్య కనిపించబోతున్నాడు.పింక్ మరియు వకీల్‌ సాబ్‌ తరహాలోనే ఈ సినిమా కాస్త అటు ఇటుగా ఉంటుందని భావిస్తున్నారు.

ఆకాశమే నీ హద్దు వంటి సినిమా తర్వాత జై భీమ్‌ తో రాబోతున్న కారణంగా ఖచ్చితంగా సూర్యకు ఇది మంచి విజయాన్ని తెచ్చి పెడుతుందని అంతా నమ్మకంగా ఉన్నారు.ఇలాంటి సమయంలో సూర్య తన జై భీమ్‌ సినిమాను థియేటర్ల ద్వారా కాదు ఓటీటీ లో విడుదల చేస్తానంటూ ప్రకటించాడు.

Telugu Amazon Prime, Film News, Jai Bhim, Jai Bhim First Look, Jai Bhim Release Date, Kollywood, Ott, Surya, Surya Fans, Surya In Lawyer Role-Movie

నవంబర్‌ లో ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్‌ ద్వారా విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది.దాంతో అంతా కూడా అవాక్కవుతున్నారు.సూర్య జై భీమ్‌ ను థియేటర్లలో విడుదల చేయాలని చాలా మంది కోరుకుంటున్నారు.ఎందుకంటే నవంబర్ వరకు థియేటర్లు పునః ప్రారంభం అవ్వడం తో పాటు తప్పకుండా మంచి ఆధరణ దక్కించుకుంటాయి.

కనుక మంచి వసూళ్లు వచ్చే అవకాశం ఉంటుంది.అందుకే ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయడం లేదని ఆయన్ను ట్రోల్‌ చేస్తున్నారు.

#Jai Bhim #Surya #Surya Fans #Surya Role #Kollywood

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు