నీట్,జేఈఈ రివ్యూ పిటీషన్ ను కొట్టేసిన సుప్రీం కోర్టు

విపక్షాలు అన్నీ కూడా నీట్,జేఈఈ వంటి జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల నిర్వహణ కష్టసాధ్యమంటూ సుప్రీం కోర్టులో రివ్యూ పిటీషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.అయితే ఈ రోజు విచారణ చేపట్టిన సుప్రీం ధర్మాసనం ఈ పిటీషన్ ను కొట్టేసినట్లు తెలుస్తుంది.

 Supreme Court Dismiss The Review Petition Seeking Postpone Of Neet And Jee, Supr-TeluguStop.com

కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఈ జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల నిర్వహణ కష్టసాధ్యమని 6 బీజేపీయేతర పాలిత రాష్ట్రాలు సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్, చత్తీస్ గఢ్, రాజస్థాన్, మహారాష్ట్ర, పంజాబ్ రాష్ట్రాలు కేంద్రం నిర్ణయంపై సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశాయి.

ఆగస్టు 17న సుప్రీం ధర్మాసనం ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలంటూ రివ్యూ పిటిషన్ వేయడం తో విచారణ చేపట్టిన ధర్మాసనం ఇప్పటికే కేంద్రం పరీక్షల షెడ్యూల్ విడుదల చేసిందని, విద్యార్థులు కూడా సన్నద్ధులై ఉంటారని, ఇలాంటి తరుణంలో పరీక్షలు వాయిదా వేయడం సరికాదంటూ సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది.

దేశంలో ప్రస్తుతం కరోనా వ్యాప్తి ఉన్నందున అందుకు తగిన జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలని, పరీక్ష కేంద్రాలను శుద్ధి చేయడం, శానిటైజర్లు అందుబాటులో ఉంచడం వంటి చర్యలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలంటూ ధర్మాసనం పేర్కొంది.

అయితే ఈ జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా చూడాలంటూ ప్రభుత్వాలకు ధర్మాసనం నిర్దేశించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube