సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu )కు ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే.సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలు, ఇతర కార్యక్రమాలతో ఎంత బిజీగా ఉన్నా తన సంపాదనలో కొంత మొత్తాన్ని సేవా కార్యక్రమాల కోసం వినియోగిస్తూ మంచి పేరుతో పాటు ప్రశంసలు అందుకుంటున్నారు.
ఏపీలోని ఒక గ్రామానికి చెందిన రెండేళ్ల చిన్నారికి మహేష్ బాబు ఉచితంగా హార్ట్ సర్జరీ చేయించారు.

మహేష్ బాబు తమ పాలిట దేవుడంటూ ఆయన వల్ల సహాయం పొందిన వాళ్లు కామెంట్లు చేస్తున్నారు.“నువ్వు కాపాడిన 3772వ ప్రాణం మా పి గన్నవరం ది స్వామి.పూజించే రాళ్లలో దేవుడు ఉన్నాడో లేడో మాకు తెలియదు.
కానీ 3772 ప్రాణాలను కాపాడిన మహేశ్వరుడులో దేవుడు ఉన్నాడు.అలాంటి ఆయనకు మేము భక్తులం” అనే ఫ్లెక్సీ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది.
మహేష్ బాబు ఫ్యాన్స్ ఈ ఫ్లెక్సీ ఫోటోను వైరల్ చేస్తుండటం నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది.మహేష్ బాబు పేరు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ట్రెండింగ్ అవుతోంది.
సూపర్ స్టార్ మహేష్ బాబు మనిషి రూపంలో ఉన్న దేవుడేనని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.మహేష్ బాబును ఈ విషయంలో ఎంత మెచ్చుకున్నా తక్కువేనని చెప్పవచ్చు.
మహేష్ ప్రస్తుతం జక్కన్న సినిమాకే పరిమితమయ్యారు.

మహేష్ రాజమౌళి( Mahesh Rajamouli ) కాంబో మూవీ సెట్స్ పైకి వెళ్లాలంటే కనీసం మరో మూడు నెలల సమయం పడుతుందని చెప్పవచ్చు.మహేష్ జక్కన్న కాంబో మూవీ బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ హిట్ గా నిలవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి సినిమాకు లాభాల్లో వాటా తీసుకోనున్నారని తెలుస్తోంది.
మహేష్ జక్కన్న కాంబో మూవీ ఎన్నో ప్రత్యేకతలతో తెరకెక్కుతోంది.