నా కూతురు అలా అనడంతో గుండె పిండేసినట్టైంది.. సుమ షాకింగ్ కామెంట్స్ వైరల్!

బుల్లితెర టాలెంటెడ్ యాంకర్లలో ఒకరైన సుమ జయమ్మ పంచాయితీ సినిమాతో మే 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్నారు.తాజాగా జయమ్మ పంచాయితీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది.

 Suma Shocking Comments Goes Viral In Social Media Details,anchor Suma, Jayamma P-TeluguStop.com

ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇంటర్వ్యూలు ఇస్తున్న సుమ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.తనను ప్రతిరోజూ సంవత్సరాల నుంచి బుల్లితెరపై చూస్తున్నారని తనపై ప్రేక్షకులు చాలా ప్రేమను చూపిస్తారని సుమ వెల్లడించారు.

ఆంటీ, సుమక్క అంటూ పిల్లలు సైతం తనతో మాటలు కలుపుతారని ఆమె కామెంట్లు చేశారు.నాన్న చనిపోయిన సమయంలో అమ్మ మాత్రమే కేరళలో ఉన్నారని తోడబుట్టిన వాళ్లు లేకపోయినా ఆ బాధను మరిచిపోయి నాలుగు ఎపిసోడ్ల షూటింగ్ చేశామని ఆమె వెల్లడించారు.

నేను మొట్టికాయ వేస్తే తన భర్త క్షణంలో మామూలు మనిషి అయిపోతారని ఆమె కామెంట్లు చేశారు.అబ్బాయి బాల్యంలో తనపై చాలా కోప్పడేవాడని సుమ వెల్లడించారు.

Telugu Anchor Suma, Sp Balu, Suma, Suma Interview, Swarabhishekam-Movie

బయటకు వెళ్లిన సమయంలో ఎవరైనా తన దగ్గరకు వస్తే గట్టిగా అరిచేవాడని ఆమె చెప్పుకొచ్చారు.వరుస షూటింగ్ ల వల్ల రెండు రోజుల పాటు తాను కూతురుకు కనిపించలేదని ఆ సమయంలో కూతురు తనతో నిన్ను టీవీలో మాత్రమే చూడాలా? అని అడిగిందని సుమ పేర్కొన్నారు.ఆ సమయంలో తనకు గుండె పిండేసినట్టైందని సుమ కామెంట్లు చేశారు.తర్వాత రోజుల్లో పిల్లల కోసం వర్క్ ను తగ్గించుకుంటూ వచ్చానని ఆమె అన్నారు.

Telugu Anchor Suma, Sp Balu, Suma, Suma Interview, Swarabhishekam-Movie

ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో తనకు ఏమీ తెలియదని రావడం, చేయడం జరిగిపోయాయని ఆమె వెల్లడించారు.నా మెదడు పాతవిషయాలను ఎప్పటికప్పుడు డిలీట్ చేస్తుందని తాను కొత్త విషయాలను మాత్రమే గుర్తుంచుకుంటానని ఆమె చెప్పుకొచ్చారు.ఎస్పీ బాలుగారు అంటే తనకు ఎంతో ఇష్టమని ఆమె కామెంట్లు చేశారు.బాలుగారు చనిపోయిన తర్వాత తాను స్వరాభిషేకం మానేశానని ఆమె చెప్పుకొచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube