స్టార్ కమెడియన్ అలీ సినీ ఇండస్ట్రీలో సుదీర్ఘ కాలం విజయవంతంగా కెరీర్ ను కొనసాగించిన సినీ ప్రముఖులలో ఒకరు.పవన్ కళ్యాణ్, పూరీ జగన్నాథ్ సినిమాలతో స్టార్ డమ్ అందుకున్న అలీ ఇప్పటికీ అడపాదడపా పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నారు.
అయితే అలీకి ఒక ఆరోగ్య సమస్య ఉందని ఆ సమస్య అతనికి వరమైందనే సంగతి చాలా మందికి తెలియదు.
అలీ నత్తి సమస్యతో బాధ పడుతున్నారని చాలామందికి తెలియదు.
అయితే ఆ నత్తి వల్ల అతని కామెడీ టైమింగ్ ఇతర కమెడియన్లకు భిన్నంగా ఉండటం అతని సక్సెస్ కు కారణమైంది.అలీ ప్రస్తుతం వైసీపీ పార్టీ తరపున ప్రచారం చేస్తున్నారు.
పార్టీ ఆదేశిస్తే పవన్ కు వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి సైతం సిద్ధమేనని పలు సందర్భాల్లో అలీ ప్రకటించిన సంగతి తెలిసిందే.మరి అలీ నిజంగా ఆ విధంగా పోటీ చేస్తారో లేదో చూడాల్సి ఉంది.

అలీకి సినిమాల్లోనే ఎక్కువ మొత్తం పారితోషికం వచ్చే అవకాశం ఉన్నా అలీ మాత్రం రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు.తనకు ఈ స్థాయిలో గుర్తింపు రావడానికి ప్రజలే కారణమని ప్రజల కోసం ఏదైనా చేయాలని ఆయన అనుకుంటున్నారు.అలీ రాజకీయాల్లో సక్సెస్ కావడం కష్టం కాదని కొంతమంది అనుకుంటున్నారు.అలీని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

అలీ రాజకీయాల్లో యాక్టివ్ గా ఉండటంతో వైసీపీ అభిమానుల సపోర్ట్ సైతం ఆయనకు అంతకంతకూ పెరుగుతోంది.టీవీ షోలకు, టాక్ షోలకు కూడా అలీ దూరమయ్యారనే సంగతి తెలిసిందే.కెరీర్ పరంగా అలీ మరిన్ని విజయాలను అందుకోవాలని అభిమానులు మనస్పూర్తిగా కోరుకుంటున్నారు.స్టార్ కమెడియన్ అలీ రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలను అందుకుని రాజకీయాల్లో చరిత్రను తిరగరాస్తారేమో చూడాల్సి ఉంది.