తెలుగు బిగ్ బాస్ ప్రతి సీజన్ లో కూడా ప్రేమ జంటలను మనం చూస్తూ ఉన్నాం.ఫేక్ లవ్ స్టోరీస్ ను బిగ్ బాస్ లో ప్రతి సీజన్ లో కూడా చూస్తూనే ఉన్నారు ప్రేక్షకులు.
బిగ్ బాస్ లో ఎక్కువ రోజులు ఉండాలి అంటే రిలేషన్ పెట్టుకోవాలని కొందరు నిరూపించారు.ఒక బిగ్ బాస్ విజేత ఏకంగా రిలేషన్ పెట్టుకుంటే కచ్చితంగా విజేతగా నిలువ వచ్చు అంటూ నిరూపించాడు.
మొత్తానికి బిగ్ బాస్ లో లవ్ స్టోరీస్ కు కొదవ లేవు.మొన్నటి వరకు శ్రీసత్య తో అర్జున్ కళ్యాణ్ తెగ పులిహోర కలిపేందుకు ప్రయత్నించాడు.
కానీ అతడి ప్రయత్నం సఫలం అవ్వలేదు.కొన్నాళ్ల పాటు ఆ ప్రయత్నం తో హౌస్ లో ఉన్నాడు కానీ ఆ తర్వాత కనిపించకుండా పోయాడు.
ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చిన అర్జున్ కళ్యాణ్ మీడియాలో కూడా కనిపించడం లేదు.ఇప్పుడు హౌస్ లో శ్రీహాన్ మరియు శ్రీ సత్య ల యొక్క స్నేహం మరో లెవల్ కు చేరుతున్నట్లుగా అనిపిస్తుంది.
ఇద్దరి మధ్య బాండింగ్ కాస్త ఎక్కువ అవుతుంది అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.సోషల్ మీడియాలో వీరిద్దరి గురించి తెగ ప్రచారం జరుగుతోంది.అప్పుడు సిరి హౌస్ లో ఉన్నప్పుడు శ్రీహాన్ ను మర్చి పోయి షన్నూ తో లవ్ లో పడింది.

ఇప్పుడు శ్రీహాన్ బయట సిరి ఉందనే విషయం మర్చి పోయి తెగ శ్రీ సత్య తో రొమాన్స్ చేస్తున్నాడు అంటూ కామెంట్స్ వస్తున్నాయి.పెద్ద ఎత్తున వీరిద్దరి గురించి ప్రచారం జరుగుతున్న నేపథ్యం లో సిరి సన్నిహితుల వద్ద స్పందించింది.తన యొక్క శ్రీహాన్ గురించి అంతా తెలుసు అని.మీడియా లో వస్తున్న వార్తలను తాను నమ్మాలి అనుకోవడం లేదని.శ్రీహాన్ విజేతగా వస్తాడని.
వీటన్నింటిని కూడా పట్టించుకోడు అంటూ ఆమె అభిప్రాయం వ్యక్తం చేసింది.