టాలీవుడ్ యంగ్ హీరోల స్థాయిలో సుడిగాలి సుధీర్ కి గుర్తింపు ఉంది అనడంలో సందేహం లేదు.జబర్దస్త్ లో దాదాపుగా పది సంవత్సరాలుగా చేస్తూ ఉన్న సుడిగాలి సుదీర్ ఇప్పుడు జబర్దస్త్ కి దూరమై వరుసగా సినిమాల్లో నటిస్తున్నాడు.
ఇప్పటికే ఈయన నటించిన కొన్ని సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.అవి కమర్షియల్ గా పెద్ద సక్సెస్ అవ్వలేక పోయాయి.
కానీ సుడిగాలి సుధీర్ చాలా నమ్మకం పెట్టి ఎక్కువ కష్టపడ్డ సినిమా గాలోడు.ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
గాలోడు సినిమా కోసం సుడిగాలి సుదీర్ దాదాపు రెండున్నర సంవత్సరాలుగా కష్టపడుతున్నామని పేర్కొన్నాడు.అంతే కాకుండా ఈ సినిమా చిత్రీకరణ కోసం చాలా దూరం వెళ్ళామని.
ఆక్సిజన్ కూడా అందనంత దూరం లో ఈ సినిమా యొక్క షూటింగ్ కార్యక్రమాలు నిర్వహించామని సుధీర్ ఇటీవల ప్రమోషన్ కార్యక్రమాలో పేర్కొన్నాడు.

సినిమా కోసం ఎంత కష్టపడి తెరకెక్కించినా.ఎంత అద్భుతంగా తీసిన కూడా మంచి రిలీజ్ టైం చూసి విడుదల చేస్తేనే బాగుంటుంది.ఈ సినిమా కు అదే కలిసి వచ్చింది.
నేడే సినిమా కు పోటీగా ఏ సినిమా లేక పోవడం తో ఉన్న సినిమా లు కూడా పెద్దగా గుర్తింపు లేని హీరోల సినిమాల అవడం తో సుడిగాలి సుదీర్ సినిమా నే పెద్ద సినిమా అయింది.ఏ వృక్షం లేని చోట ఏదో… అన్నట్టు సుడిగాలి సుదీర్ నటించిన గాలోడు సినిమా నే ఇప్పుడు భారీ బ్లాక్ బస్టర్ సినిమా అన్నట్లుగా పరిస్థితి ఉంది.
అందుకే ఈ సినిమా కు మంచి కలెక్షన్స్ నమోదు అవుతున్నాయి.మొదటి ఆట కు కాస్త తక్కువ కలెక్షన్స్ నమోదైనా రెండవ ఆట నుండి భారీ ఎత్తున కలెక్షన్స్ వస్తున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యుల నుండి సమాచారం అందుతుంది.