సింగర్ కౌసల్య…( Singer kousalya ) గుంటూరులో పుట్టి తన మాధుర్యమైన గొంతుతో ఎన్నో వందల పాటలు పాడిన కౌసల్య తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక తలమానికమని చెప్పుకోవచ్చు.ఆమె గొంతు నుంచి జాలువారి నా పాటలు ఎన్నో ఇప్పటికీ అభిమానుల చెవులలో మారుమ్రోగుతూనే ఉంటాయి.
మొట్టమొదటిసారిగా ఆర్పి పట్నాయక్ సంగీత దర్శకత్వంలో రవితేజ చిత్రం అయినా నీకోసం లో పాట పాడి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది కౌసల్య.ఆ తర్వాత తెలుగు తో పాటు తమిళ, కన్నడ భాషల్లో ఏకంగా 400 ల పాటలు పాడింది.
తొలిసారిగా ఆర్పి పట్నాయక్ అవకాశం ఇచ్చినప్పటికీ ఆమెను సింగర్ గా చక్రి ( Chakri ) ఎక్కువగా ఎంకరేజ్ చేస్తూ వచ్చాడు.ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో అసలు ఎక్కువ డబ్బులు ఎవరూ ఇచ్చేవారు కాదని చెబుతోంది కౌసల్య ఆ తర్వాత చక్రి గారి వల్లే ఒక పాటకి 5000 చొప్పున ఇవ్వడం మొదలుపెట్టారు అంటుంది.
ఇక కౌసల్యకి వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి ఒక కొడుకు పుట్టిన తర్వాత భర్త వదిలేయడంతో ఆమె ప్రస్తుతం సింగిల్గానే ఉంటుంది కొడుకుని చదివించుకుంటూ ఆమె తన కెరీర్ ను కొనసాగిస్తుంది.ఇప్పటివరకు మళ్ళీ పెళ్లి చేసుకోలేదు.అయితే ఇటీవల ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె వ్యక్తిగత మరియు వృత్తి గత జీవితాల్లో గల అనేక విషయాలను ఆమె అభిమానులతో పంచుకుంది.చక్రి గారికి ఆస్థాన గాయనిగా కౌసల్య చాలా ఏళ్ల పాటు పనిచేసింది.
అతని దగ్గరే తాను పూర్తిస్థాయి సింగర్ గా అవతారమైతే ఆయనకు కన్నుమూసే వరకు కూడా చక్రికి పాటలు పాడుతూ వచ్చింది.గతం తో పోలిస్తే ఇప్పుడు కాస్త అమే ప్రభావం తగ్గింది అని అనుకోవచ్చు.
అయితే డబ్బులు విషయంలో తాను ఎప్పుడూ వెనకబడే ఉన్నానని తనకు ఎవరు సరిగా పేమెంట్ ఇచ్చేవారు కాదని చక్రి గారు 5000 తో మొదలు పెట్టారని కానీ ఆయన కన్నుమూసే సమయానికి నాలుగు లక్షలకు పైగా అతని దగ్గర నుంచి రావాల్సిన బకాయిలు ఉన్నాయని చెప్పింది.గుండెపోటుతో చక్రి మరణించడంతో ఆ డబ్బులను ఎవరిని అడగలేకపోయానని ఇప్పటికీ డబ్బు చేరలేదని చెప్పింది.ప్రస్తుతమున్న సింగర్స్ ( Singers ) ఎక్కువగా ఫ్రీగా పాడటం లేదా తక్కువ డబ్బుకు పాడటం అలవాటు చేయడంతో సీనియర్ సింగర్స్ కి డబ్బులు ఎక్కువ ఇవ్వాల్సి వస్తుందని తమను ఎవరు పిలవడం లేదని అందుకే తమ పాటలు తగ్గిపోయాను పోయాయని చెబుతోంది చివరిసారిగా సోగ్గాడే చిన్నినాయన సినిమాలో ఒక పాట పాడినట్టుగా చెప్తోంది కౌసల్య.