బీహార్ రాజకీయాలు రసవత్తరంగా తయారయ్యాయి.గత ఎన్నికల్లో బీజేపీతో పొత్తుపెట్టుకుని సీఎం కుర్చీని మరోసారి అధిరోహించిన జేడీయూ అధినేత నితీశ్ కుమార్ ఇటీవల ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన విషయం తెలిసిందే.
తన సీఎం పదవికి రాజీనామా చేసి బీజేపీ కేంద్ర పెద్దలు మోడీ, అమిత్ షాకు ఊహించని షాక్ ఇచ్చాడు.అనంతరం కాంగ్రెస్,ఆర్జేడీతో కలిసి మహాగాట్భందన్‌ను ఏర్పాటు చేసి మళ్లీ నితీశ్ బీహార్ సీఎంగా ప్రమాణం చేసి దేశరాజకీయాల్లో సంచలనం సృష్టించారు.
నితీష్‌కు షాకిచ్చిన బీజేపీ
గత సార్వత్రిక ఎన్నికల్లో జేడీయూ కూటమికి తక్కువ స్థానాలు వచ్చిన ఎన్నికల ముందు ఇచ్చిన మాటకు కట్టుబడి బీజేపీ పార్టీ నితీశ్‌ను సీఎం చేసింది.అయితే, రాష్ట్రంలో తన పార్టీని లేకుండా చేసేందుకు బీజేపీ పెద్దలు ప్లాన్ చేశారని భావించిన నితీశ్ కుమార్ కమలంతో దోస్తీకి నై అన్నారు.
ఆ తర్వాత ప్రతిపక్ష పార్టీ, రాజకీయ శత్రువు అయిన ఆర్జేడీతో పొత్తుపెట్టుకున్నాడు.

దీంతో కమలం పార్టీకి గట్టి షాక్ తగిలింది. ఈ క్రమంలోనే జేడీయూకు షాక్ ఇచ్చేందుకు కమలం పెద్దలు స్కెచ్ వేశారు.అనుకున్నట్టుగానే జేడీయూకు చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలలో ఐదుగురిని లాగేశారు.
దీంతో నితీశ్ కుమార్ ఒక్కసారిగా కంగు తిన్నట్టు తెలుస్తోంది.అయితే, ఇది జరిగింది బీహార్‌లో కాదు.
మణిపూర్ రాష్ట్రంలో.ప్రస్తుతం మణిపూర్‌లో బీహార్ ప్రభుత్వం కొలువు దీరింది.
గత ఎన్నికల్లో నితీశ్ కుమార్ జేడీయూ పార్టీ 30 స్థానాల్లో పోటీ చేయగా.అందులో ఏడుగురు గెలుపొందారు.
తాజాగా ఐదుగురు కమలం పార్టీ కండువా కప్పుకోవడంతో సీఎం నితీశ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.బీజేపీ ప్రాంతీమ పార్టీలను నాశనం చేసేందుకు ప్రయత్నిస్తోందని ఫైర్ అవుతున్నారు.