తెలంగాణలో టీడీపీకి బిగ్ షాక్ తగిలింది.ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ రాజీనామా చేశారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయంతో తీవ్ర మనస్తాపానికి గురైన కాసాని పార్టీని వీడారు.ఈ మేరకు రాజీనామా లేఖను పార్టీ అధినేత చంద్రబాబుకు పంపించినట్లు కాసాని తెలిపారు.
ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పార్టీ ఉనికికే ప్రమాదం కలిగే విధంగా పోటీకి దూరంగా ఉండటం సరికాదని ఆయన అన్నారు.తెలంగాణలో పోటీ చేయాలని పార్టీ శ్రేణులు కోరుతున్నారన్న కాసాని లోకేశ్ కు సుమారు ఇరవై సార్లు ఫోన్ చేసినా స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయొద్దని చంద్రబాబు చెప్పారన్నారు.కానీ గత కొన్నేళ్లుగా పార్టీ కోసం పని చేస్తున్న కార్యకర్తలకు తానేం సమాధానం చెప్పాలో అర్థం కాలేదన్నారు.
పార్టీలో నేతలకు, కార్యకర్తలకు అన్యాయం చేయడం సరైనది కాదన్న కాసాని ఈ నేపథ్యంలోనే పార్టీకి రాజీనామ చేస్తున్నట్లు ప్రకటించారు.