వైసీపీకి, జగన్ కు అత్యంత కీలకమైన వ్యక్తిగా గుర్తింపు పొందిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి( Alla Ramakrishna Reddy ) ఇటీవల వైసిపికి , తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.రాజీనామా చేసిన అనంతరం ఆయన ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు.
వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడుగా పేరుపొందిన రామకృష్ణారెడ్డి వైసీపీకి రాజీనామా చేయడం పెద్ద కలకలమే రేపింది.మంగళగిరి వైసీపీ టికెట్ ను గంజి చిరంజీవికి కేటాయిస్తూ జగన్ నిర్ణయం తీసుకోవడంతో అసంతృప్తికి గురై ఆళ్ల రాజీనామా చేశారు. 2014 – 19 ఎన్నికల్లో మంగళగిరి నుంచి రామకృష్ణారెడ్డి పోటీ చేసి గెలుపొందారు.2019లో నారా లోకేష్( Nara Lokesh ) పై ఆయన విజయం సాధించారు .మంగళగిరి నుంచి పోటీ చేసి నా గెలవడం కష్టమని , లోకేష్ ను ఓడించలేరని భావించిన జగన్ సామాజిక వర్గాలు లెక్కలను పరిగణలోకి తీసుకుని పద్మశాలి సామాజిక వర్గం ఈ నియోజకవర్గంలో ఎక్కువగా ఉండడంతో ఆ సామాజిక వర్గానికి చెందిన గంజి చిరంజీవికి నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతలను అప్పగించారు.

ఈ విషయంలోనే అసంతృప్తి కి గురైన రామకృష్ణ రెడ్డి కాంగ్రెస్( Congress ) లో చేరారు.అయితే రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, రామకృష్ణారెడ్డి సోదరుడు అయోధ్య రామిరెడ్డి తో మంతనాలు చేశారు.ఇవి ఫలించడంతో మళ్లీ ఆళ్ల రామకృష్ణారెడ్డి జగన్ సమక్షంలో మరోసారి వైసీపీ ( YCP )కండువా కప్పుకున్నారు.
తాజాగా ఆళ్ల పార్టీ మారిన వ్యవహారంపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు.ఆళ్ల రామకృష్ణారెడ్డి తనకు చాలా దగ్గర మనిషి అని, ఆయన ఏ పార్టీలో ఉన్నా… ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలని తాను కోరుకుంటున్నాను అంటూ షర్మిల వ్యాఖ్యానించారు.

ఆళ్ల రామకృష్ణారెడ్డి వైసీపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన తరువాత నుంచి ఆయనపై ఏ స్థాయిలో ఒత్తిడి వచ్చిందో తనకు తెలుసునని, ఆయన చెల్లిగా ఆ బాధను తాను అర్థం చేసుకోగలను అంటూ షర్మిల వ్యాఖ్యానించారు.ఒక మంచి వ్యక్తి రాంగ్ ప్లేస్ లో ఉన్నారంటూ షర్మిల ఆళ్ల రామకృష్ణారెడ్డిని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు.