మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.సీఎం కేసీఆర్ తోనే తన రాజకీయ జీవితమని చెప్పారు.
దీంతో పార్టీ మారుతారన్న ఊహాగానాలకు చెక్ పడింది.కేసీఆర్ వలనే ఖమ్మం జిల్లా సస్యశ్యామలంగా ఉందన్నారు.
రాజకీయాల్లో ఒడిదుడుకులు ఉంటూనే ఉంటాయని తెలిపారు.నిజాయితీగా ఉంటానన్న తుమ్మల.
నీతి మాలిన రాజకీయాలు చేయనని వెల్లడించారు.దేశ రాజకీయాల్లో మార్పు కోసం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో కేసీఆర్ నాయకత్వాన్ని బలపర్చాల్సిన అవసరం ఉందన్నారు.ఇందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తుమ్మల పిలుపునిచ్చారు.