టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వం లో మహేష్ బాబు హీరో గా ఒక సినిమా రూపొందిపోతున్న విషయం తెలిసిందే.ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వం లో ఒక సినిమా ను చేస్తున్నాడు.
వచ్చే సంవత్సరం సమ్మర్ కానుకగా ఆ సినిమా విడుదల కాబోతుంది.త్రివిక్రమ్ సినిమా పూర్తి అయిన తర్వాత రాజమౌళి కి దాదాపు రెండు సంవత్సరాల పాటు గంపగుత్తగా డేట్ లను మహేష్ బాబు ఇచ్చాడు అంటూ వార్తలు వస్తున్నాయి.
వచ్చే సంవత్సరం షూటింగ్ కార్యక్రమాలు ప్రారంభించేలా రాజమౌళి ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేస్తున్నారు అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.అయితే ఇప్పటి వరకు మహేష్ బాబు కు నచ్చే విధంగా స్టోరీ లైన్ సిద్ధమైందా.
కథ ను విజయేంద్ర ప్రసాద్ రెడీ చేశారా అనే అనుమానాలు కొత్తగా కొందరు లేవనెత్తుతున్నారు.మహేష్ బాబు కథ ను నచ్చడం అంటే అంత సులభం కాదు, ఆయన కు చాలా రకాల డౌట్స్ వస్తూ ఉంటాయి.

కథ విషయంలో మహేష్ బాబుకు వచ్చే డౌట్స్ ని విజయేంద్ర ప్రసాద్ మరియు రాజమౌళి ఎలా నివృత్తి చేస్తారు అనేది చూడాలి.మహేష్ బాబు కథ ఎంపిక విషయం లో చాలా జాగ్రత్తగా ఉంటారు.అందుకనే ఆయన సూపర్ స్టార్ అయ్యారు అనడం లో సందేహం లేదు.మహేష్ బాబు కథ నచ్చిన తర్వాత మాత్రమే షూటింగ్ కి వెళ్తారు, అదే మంచిది అంటూ చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వం లో గతం లో వచ్చిన సినిమా లతో పోలిస్తే మహేష్ బాబు సినిమా అంతకు మించి అన్నట్లుగా ఉంటుందని.యూనివర్సిల్ స్థాయిలో సినిమా ఉంటుంది అంటూ అంతా నమ్మకం తో ఉన్నారు.
కనుక మహేష్ బాబు కు నచ్చే విధంగానే కథ ను రెడీ చేసి ఉంటారని.అయితే ఆ కథ కు మహేష్ బాబు ఒకే చెప్పాడా లేదా అనేది తెలియాల్సి ఉంది అంటూ మీడియా సర్కిల్స్ లో ప్రచారం జరుగుతుంది.







