టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితుల కస్టడీ తొలిరోజు ముగిసింది.ఈ కేసులో ఉన్న ముగ్గురు నిందితులను సుమారు ఏడు గంటల పాటు ప్రశ్నించారు.
ఈ క్రమంలో నిందితులను వేర్వేరు గదుల్లో కూర్చోబెట్టి పోలీసులు ప్రశ్నించారని తెలుస్తోంది.ఒకే ప్రశ్నను ముగ్గురికి వేసి సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేశారని సమాచారం.
ఈ క్రమంలో కొన్ని ప్రశ్నలకు ముగ్గురు వేరు వేరు సమాధానాలు చెప్పారని పోలీసులు వెల్లడించారు.వీరిలో రామచంద్రభారతి కొన్ని ప్రశ్నలకు మౌనంగా ఉన్నారని, కొన్నింటిని దాటవేసే ప్రయత్నం చేశారని తెలుస్తోంది.
ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టడానికి రాలేదని రామచంద్రభారతి తెలిపారు.కాగా వీరిని రేపు ఉదయం పోలీసులు మరోసారి విచారించనున్నారు.







