అడవిలో సింహందే పైచేయి.సింహాన్ని మించిన వేట మరే జంతువుకు సాధ్యం కాదనే చెప్పాలి.
దానితో ఈ విషయంలో ఏ జంతువు కూడా పోటీ పడటం అంత ఈజీ కాదనే చెప్పాలి.సింహం కన్ను పడితే అది ఎంత తెలివైన జంతువైనా లేదంటే బలమైన జంతువైనా సరే దానికి ఆహారం కావాల్సిందే.
అనుకున్నదే తడవుగా సింహం రంగంలోకి దిగితే క్షణాల్లో వేట పూర్తి చేస్తుంది.రెప్ప వాల్చే లోఆగా మెరుపు దాడి చేయడంలో సింహం దిట్ట.
దాని ధాటికి ఏ జంతువు కూడా నిలువలేదు.కాబట్టే సింహాన్ని అడవికి రాజుగా చెప్పేది.
ఇక సింహం కన్ను ఏ జంతువు మీద పడినా సరే ఆ జీవులన్ని పరుగెత్తుతూ తమ ప్రాణాలను నిలుపుకోవడానికి ట్రై చేస్తాయి.కానీ సింహం పంజా నుంచి తప్పించుకోవడం అంటే మామూలు విషయం కాదు.
ఎంతో రాసి పెట్టి ఉంటే గానీ అది సాధ్యం కాదనే చెప్పాలి.ఇక ఇపపుడు కూడా ఇలాంటి సింహం వేటకు సంబంధించిన వీడియో ఒకటి తాజాగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఈ వీడియో చూస్తే అసలు సింహానికి వేటలో ఇంత నైపుణ్యం ఉందా అంతా ఆశ్చర్యపోవాల్సిందే.ఇక ఇప్పుడు ఓ అడవి పందిని సింహం ఎలా వేటాడింతో చూద్దాం.
ఇక ఓ అడవిపంది తన కలుగులో దాక్కోవడంతో అది గమనించిన సింహం కలుగు దగ్గరికి వెళ్లి భూమిని తన కాళ్లతో తవ్వడానికి ట్రై చేస్తుంది.ఇక ఎలాగోలా తవ్వేసి అందులో ఉన్న అడవిపందిని తన పళ్లతో అదిమిపట్టి బయటికి లాగేస్తుంది అడవి సింహం.అయితే ఎలాగోలా దాని నుంచి విడిపించుకున్న అడవి పంది వెంటనే మైదానంలోకి పరుగెత్తుతుంది.కానీ సింహం తన బలాన్నంతా ఉపయోగించి ఒక్క ఉదుటన అడవి పందిని క్యాచ్ చేసేస్తుంది.
ఇంకేముంది ఆ అడవిపంది కాస్తా సింహానికి ఆహారంగా మారిపోతుంది.