అందంగా ఆకర్షణీయంగా కనిపించాలని అందరికీ ఉంటుంది.అలా కనిపించాలి అంటే మన ముఖ చర్మం ఎలాంటి మచ్చలు, ముడతలు, మొటిమలు లేకుండా కాంతివంతంగా మెరిసిపోతూ ఉండాలి.
ఆ మెరుపు కోసం చాలా మంది రకరకాల క్రీములు, సీరంలు వాడుతుంటారు.అలాగే నెలకు ఒకటి లేదా రెండుసార్లు వేలకు వేలు ఖర్చు పెట్టి ఫేషియల్ చేయించుకుంటూ ఉంటారు.
కానీ, ఇప్పుడు చెప్పబోయే హోమ్ మేడ్ క్రీమ్ ను రోజు నైట్ వాడితే ఫేషియల్ కూడా అక్కర్లేదు.సహజంగానే మీ అందం రెట్టింపు అవుతుంది.
మరి ఆ క్రీమ్ ఏంటి.దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.
అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా ఒక పెద్ద టమాటోను ( Tomato )తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి.అలాగే ఒక కీర దోసకాయను ( Cucumber )కూడా తీసుకుని ముక్కలుగా కట్ చేయాలి.ఆ తర్వాత మిక్సీ జార్ లో కట్ చేసి పెట్టుకున్న కీరా దోసకాయ ముక్కలు, టమాటో ముక్కలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్టైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.
ఈ జ్యూస్ లో వన్ టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసి ఉండలు లేకుండా కలపాలి.
ఆపై స్టవ్ పై పెట్టి దగ్గర పడేంత వరకు ఉడికించాలి.క్రీమీ స్ట్రక్చర్ వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసి ఉడికించిన మిశ్రమాన్ని చల్లారబెట్టుకోవాలి.
ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్, ( Aloe Vera Gel )నాలుగు చుక్కలు రోజ్ ఎసెన్షియల్ ఆయిల్, పావు టేబుల్ స్పూన్ స్వీట్ ఆల్మండ్ ఆయిల్ వేసుకొని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.తద్వారా మన క్రీమ్ రెడీ అవుతుంది.

ఈ క్రీమ్ ను ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.రోజు నైట్ నిద్రించే ముందు ముఖానికి తయారు చేసుకున్న క్రీమ్ ను అప్లై చేసుకుని పడుకోవాలి.ఈ క్రీమ్ మీ చర్మాన్ని తెల్లగా కాంతివంతంగా మారుస్తుంది. ముడతలను మాయం చేసి స్కిన్ టైట్ అయ్యేందుకు తోడ్పడుతుంది.అలాగే చర్మం పై మొండి మచ్చలను దూరం చేస్తుంది.మొటిమలకు సైతం చెక్ పెట్టి.
.మిమ్మల్ని రెట్టింపు అందంతో చూపిస్తుంది.







