అన్నం పరబ్రహ్మ స్వరూపం. సకల ప్రాణాలకు మూలాధారం.
అటువంటి అన్నం మనకు మూడు పూటలా దొరుకుతుంది అంటే కచ్చితంగా మనం అదృష్టవంతులమే.అలాగే రైస్ ను ఎప్పుడూ వేస్ట్ చేయకూడదు.
అయితే చాలా మంది రాత్రి మిగిలిపోయిన రైస్( Night Leftover Rice ) ను పారేస్తుంటారు.కొందరు ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుని మరుసటి రోజు తింటున్నారు.
కానీ ఇవి రెండు చేయకూడదు.పైన చెప్పుకున్నట్లు రైస్ ను వేస్ట్ చేయకూడదు.
అలా అని ఫిడ్జ్ లో పెట్టుకొని తింటే లేనిపోని జబ్బులు వస్తాయి.మరి మిగిలిపోయిన రైస్ ను ఎలా తీసుకోవాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకుని అందులో మిగిలిపోయిన రైస్ మొత్తాన్ని వేసుకోవాలి.అలాగే కొన్ని కాచి చల్లార్చిన పాలు, పావు టేబుల్ స్పూన్ జీలకర్ర, రెండు రెబ్బలు కరివేపాకు, కొన్ని పచ్చి ఉల్లిపాయ ముక్కలు, పావు టేబుల్ స్పూన్ అల్లం తురుము వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.చివరిగా కొంచెం పెరుగు వేసి మరోసారి కలిపి మూత పెట్టి వదిలేయాలి.
మరుసటి రోజు ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్( Breakfast ) లో ఈ రైస్ ను తింటే ఉంటుందీ.
అదిరిపోతుంది.ఉదయం పూట ఇడ్లీ, దోశ, వడ, పూరీ, చపాతీ వంటి టిఫిన్లకు బదులుగా నైట్ మిగిలిపోయిన రైస్ ను పైన చెప్పిన విధంగా తయారు చేసుకుంది తింటే బోలెడు ఆరోగ్య లాభాలు పొందుతారు.
ముఖ్యంగా ఇమ్యూనిటీ సిస్టం బూస్ట్ అవుతుంది.సీజనల్ వ్యాధులు వచ్చే రిస్క్ తగ్గుతుంది.
అలాగే రాత్రి మిగిలిపోయిన రైస్ ను పైన చెప్పిన విధంగా తీసుకుంటే రోజంతా ఫుల్ ఎనర్జిటిక్ గా ఉంటారు.నీరసం, అలసట వంటివి దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.ఎముకలు, కండరాలు దృఢంగా మారతాయి.బాడీ హైడ్రేటెడ్( Hydrate ) గా ఉంటుంది.అల్సర్లు, పేగు సంబంధిత సమస్యలు ఏమైనా ఉన్నా సరే దూరం అవుతాయి.మరియు బాడీ లో అధిక వేడి సైతం తొలగిపోతుంది.