తాజాగా సింగపూర్( Singapore ) దేశంలో ఓ మహిళకు, టాక్సీ డ్రైవర్‌కు మధ్య గొడవ జరిగింది.మహిళ పట్ల డ్రైవర్ అసభ్యంగా ప్రవర్తించాడు.
అతను ఆమె జాతి, ఆమె కుమార్తె గురించి చెడుగా మాట్లాడాడు.ఆ మహిళ గొడవను చిత్రీకరించి ఆన్‌లైన్‌లో పెట్టింది.
అది చూసి చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.డ్రైవర్ రాంగ్ రూట్లో కారు డ్రైవ్ చేయడంతో గొడవ మొదలైంది.
పక్కదారి పట్టడమే కాక ఆ మహిళను సదరు టాక్సీ డ్రైవర్ నిందించాడు.‘నువ్వు ఇండియన్‌వి.
నేను చైనీస్‌ని మీరు చాలా.చెత్త కస్టమర్ అని జనాలకు తెలుసు.’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

అయితే తాను భారతీయురాలిని కాదని ఆ మహిళ క్లారిటీ ఇచ్చింది.ఆమె “నేను సింగపూర్ యురేషియన్, సింగపూర్ ఇండియన్ కాదు.అయినా ఇండియన్ కావడం తప్పు కాద”ని డ్రైవర్ కు ఆమె బుద్ధి చెప్పే ప్రయత్నం చేసింది.
సింగపూర్-భారతీయులు( Singaporean-Indians ) కూడా ఉన్నారు, ఇక్కడ నివసించే హక్కు అందరికీ ఉంది అని, జాత్యహంకారం ఒంటినిండా నింపుకొని ఉన్నావంటూ అతడిపై ఫైర్ అయ్యింది.

సదరు మహిళా ప్యాసింజర్ చట్టాన్ని ఉల్లంఘిస్తోందని డ్రైవర్ కూడా నోరు పారేసుకున్నాడు.యువర్ ఇల్లీగల్ అంటూ అతడు చేసిన కామెంట్స్ ఆ మహిళకు బాగా కోపం తెప్పించాయి.ఆ మహిళ కూతురు కారులో కూర్చునేంత ఎత్తు లేకపోవడంతో అతడు మాట్లాడుతూ.“మీ పాప ఎత్తు 1.35మీ కంటే తక్కువ…నువ్వు నాతో వాదించకు, మీటర్ 1.35 మాత్రమే” అంటూ ప్యాసింజర్ బాలికను బాడీ షేమ్ చేశాడు.డ్రైవర్ నీచంగా వ్యవహరిస్తున్నాడని వీడియో తీసి సోషల్ మీడియాలో పెడతానని మహిళ చెప్పింది.
అతను “ఫిర్యాదు చేస్తావా, మంచిది.ఎందుకంటే మీరు చాలా చట్టవిరుద్ధం.” అని అన్నాడు.సింగపూర్‌కు చెందిన రైడ్-హెయిలింగ్ కంపెనీ టాడాలో ఈ డ్రైవర్ పనిచేస్తున్నాడు.
అతడిపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.







