డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందిన సినిమా అన్నీ మంచి శకునములే.( Anni Manchi Sakunamule ) ఈ సినిమాలో సంతోష్ శోభన్, మాళవిక నాయర్, నరేశ్, రాజేంద్ర ప్రసాద్, రావు రమేశ్, షావుకారు జానకి, గౌతమి, వాసుకి, వెన్నెల కిశోర్ తదితరులు నటించారు.
ఇక ఈ సినిమాను స్వప్న సినిమాస్, మిత్ర విందా మూవీస్ బ్యానర్ పై స్వప్న దత్, ప్రియాంకా దత్ నిర్మించారు.మిక్కీ జే.మేయర్ సంగీతం అందించారు.సన్నీ కూరపాటి & రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు.
ఇక ఇప్పటికే ఈ సినిమా పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెంచుకున్నారని చెప్పాలి.ముఖ్యంగా ప్రమోషన్స్ భాగంలో సినీ బృందం బాగా హైప్ క్రియేట్ చేశారు.ఇక ఈరోజు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాగా ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుందో చూద్దాం.
కథ:
కథ విషయానికి వస్తే.ప్రసాద్ (రాజేంద్ర ప్రసాద్), దివాకర్ (రావు రమేశ్) కుటుంబాల మధ్య కొన్ని పాత గొడవలు ఉంటాయి.అయితే వీరిద్దరి ముత్తాతలు 1919లో విక్టోరియాపురం అనే గ్రామంలో ఒక కాఫీ ఎస్టేట్‌ని ప్రారంభిస్తారు.
ఇక ఆ కాఫీని క్వీన్ విక్టోరియా చాలా ఇష్టపడుతుంది.అలా ఆ కాఫీ ఎస్టేట్ బాగా ఫేమస్ అవుతుంది.
కొన్నాళ్లకు ఆ ఎస్టేట్ పంపకాల విషయంలో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతాయి.అది కాస్త కోర్టుకు ఎక్కుతారు.
ఇక ఆ కేసు అలా నాలుగు తరాలుగా నడుస్తూనే ఉంటుంది.
ఇక దివాకర్ తమ్ముడు సుధాకర్ (నరేశ్) కు కొడుకు రిషి (సంతోష్ శోభన్)( Santosh Shoban ) పుట్టగా.అదే రోజు అదే ఆస్పత్రిలో ప్రసాద్‌కు మూడో కూతురు ఆర్య (మాళవిక నాయర్) పుడుతుంది.అయితే డాక్టర్ చేసిన నిర్లక్ష్యం వల్ల ఇద్దరు పిల్లలు మారిపోతారు.
అలా ప్రసాద్ ఇంట్లో రిషి, సుధాకర్ ఇంట్లో ఆర్య పెరుగుతారు.ఇక వీరిద్దరు చిన్నప్పటి నుంచి స్నేహితులుగా ఉంటారు.
ఇక పెద్దయ్యాక రిషికి ఆర్యపై ఇష్టం పెరుగుతుంది.అయితే ఆ విషయం ఆమెతో చెప్పడానికి ఇబ్బంది పడుతాడు.
అయితే అనుకోకుండా బిజినెస్ విషయంలో ఆర్య, రిషి కలిసి యూరప్ వెళ్తారు.అక్కడ ఇద్దరి మధ్య చిన్న గొడవ జరిగి విడిపోతారు.అలా ఆ తరువాత ఏం జరిగింది అనేది మిగిలిన కథలోనిది.
నటినటుల నటన:
సంతోష్ శోభన్ తన పాత్రలో లీనమాయ్యాడని చెప్పాలి.మాళవిక నాయర్( Malavika Nair ) అద్భుతంగా మెప్పించింది.ఇక రాజేంద్ర ప్రసాద్, రావు రమేశ్, నరేశ్, గౌతమి, వెన్నెల కిశోర్ తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రలకు తగ్గట్టుగా చేశారు.
టెక్నికల్:
డైరెక్టర్ కథలో కొత్తదనం చూపించలేకపోయారు.ముఖ్యంగా కథనం అంతగా ఆకట్టుకోలేకపోయింది.ఇక మిక్కీ జే.మేయర్ అందించిన మ్యూజిక్ బాగుంది.సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది.ఇక మిగిలిన నిర్మాణ విభాగాలు సినిమాకు తగ్గట్టు పని చేసాయి.
విశ్లేషణ:
కొన్ని సన్నివేశాలు ఊహించిన తగ్గట్టుగా చూపించారు డైరెక్టర్.కొత్తదనం అనేది అసలు లేకుండా పోయింది.
పాత్రలకు తగ్గట్టుగా నటీనటులను ఎంచుకున్నప్పటికీ కూడా సినిమా కథనం విషయంలో డీలా పడినట్లు అనిపించింది.
ప్లస్ పాయింట్స్:
నటినటుల నటన, కామెడీ, ఎమోషన్స్ సీన్స్.
మైనస్ పాయింట్స్:
కొన్ని సన్నివేశాలు నెమ్మదిగా సాగాయి.రొటీన్ సీన్స్.లవ్ సీన్స్ అంతగా ఆకట్టుకోలేకపోయింది.
బాటమ్ లైన్:
చివరిగా చెప్పాల్సిందేంటంటే.రొటీన్ కథతో బోరింగ్ లవ్ సీన్స్ తో వచ్చింది.ఒకసారి చూస్తే పర్వాలేదని చెప్పాలి.