రష్మిక మందన్న( Rashmika Mandanna ) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.నేషనల్ క్రష్ గా ప్రేక్షకుల చేత పిలిపించుకుంటూ పాన్ ఇండియన్ వ్యాప్తంగా అన్ని భాషల్లో వరుస అవకాశాలను అందుకుంటూ దూసుకు పోతుంది.
హిందీ, తెలుగు, తమిళ్ వంటి భాషల్లో వచ్చిన అవకాశాన్ని వద్దు అనకుండా చేసుకుంటూ పోతుంది.
సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ తనని ఎవరు ఎన్నిసార్లు ట్రోల్స్ చేసిన వాటిని పట్టించు కోకుండా ముందుకు వెళుతుంది.ఇక ఈమె తరచుగా ఏదొక విషయంపై నెట్టింట వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది.తాజాగా తన ప్రమేయం లేకుండానే వార్తల్లో నిలిచింది.
హీరోయిన్ ఐశ్వర్య రాజేష్( Aishwarya Rajesh ) చేసిన కామెంట్స్ కారణంగా ఈమె మరోసారి వార్తల్లో నిలిచింది.
ఐశ్వర్య రాజేష్ ఫర్హానా( Farhana ) ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్ వచ్చారు.
,.ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఈమె తెలుగులో ఎలాంటి పాత్రలు చేయడానికి ఇష్టపడతారు అని అడుగగా.పుష్పాలో శ్రీవల్లి తరహా పాత్రలు చేస్తా అని సమాధానం చెప్పింది.ఈ స్టేట్మెంట్ ను చాలా మంది మార్చి రాయడంతో ఐశ్వర్య రాజేష్ మరోసారి వివరణ ఇచ్చింది.
ఈమె అలాంటి పాత్రలు చేయాలని అనుకుంది కానీ ఆ పాత్ర అని కాదు అంటూ ఈమె వివరణ ఇచ్చారు.
ఈ నోట్ కు ఇప్పుడు రష్మిక రిప్లై ఇవ్వడం ఆసక్తికరంగా మారింది.”నువ్వు అంటే ఏంటో నాకు అర్ధం అయ్యింది.మన గురించి మనం వివరించాల్సిన అవసరం లేదు.నీపై ఎప్పుడు గౌరవం ఉంటుంది.ఫర్హానా కోసం ఆల్ ది బెస్ట్” అంటూ ఈమె రిప్లై ఇవ్వడం ఇప్పుడు ఇంట్రెస్టింగ్ మారింది.ఈ ఇద్దరి నటీమణుల మధ్య జరిగిన ఈ స్నేహబంధం ప్రతీ ఒక్కరిని ఆకట్టు కుంటుంది.