ఏ మాయ చేసావే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి అందరిని తన మాయలో పడేసుకుంది నటి సమంత.( Samantha ) మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకోవడంతో ఈమెకు తెలుగులో వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి.
ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా సక్సెస్ అయినటువంటి సమంతకు కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా సినిమా అవకాశాలు రావడంతో దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్రతారగా గుర్తింపు పొందారు.ఈ క్రమంలోని ఈమె నటుడు నాగచైతన్యతో కూడా ప్రేమలో పడ్డారు.
ఇలా సమంత(Samantha) నాగచైతన్య( Naga Chaitanya ) కలిసి నటించిన సినిమాలన్నీ కూడా మంచి సక్సెస్ అయ్యాయి.ఇలా వీరిద్దరి ఆన్ స్క్రీన్ పర్ఫామెన్స్ ఎంతో అద్భుతంగా ఉండేది ఇలా ప్రేమలో ఉన్నటువంటి ఈ జంట పెద్దల సమక్షంలో ఎంతో ఘనంగా పెళ్లి చేసుకోవడం అయితే వైవాహిక జీవితంలో ఇమడలేక విడాకులు తీసుకుని విడిపోవడం కూడా జరిగింది ఇలా విడాకుల తర్వాత ఎవరి దారి వారు చూసుకుంటూ ఎవరు కెరియర్ పరంగా వారు బిజీగా ఉన్నారు.
ఇక తాజాగా సమంత ఖుషి సినిమా( Khusi Movie ) ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది.
సమంత మయో సైటీసెస్( Myositis ) వ్యాధి బారిన పడటంతో ఈమె దాదాపు ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది.ఇకపోతే ఒక ఇంటర్వ్యూలో భాగంగా సమంత ఇండస్ట్రీలో తనకు ఇష్టమైనటువంటి హీరోల గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ తాను సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా అడుగు పెట్టకు ముందు నుంచే తాను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కు వీరాభిమాని అని తెలియజేశారు.
అయితే ఆయనతో కలిసి అత్తారింటికి దారేది సినిమాలో నటించే అవకాశం రావడం నిజంగా నా అదృష్టమని తెలిపారు.ఈ సినిమాలో అవకాశం వచ్చినప్పుడు చాలా సంతోషించానని సమంత తెలిపారు.
ఇక పవన్ కళ్యాణ్ అంటే ఎంతో ఇష్టమైనటువంటి తనకు పవన్ కళ్యాణ్ తో ఎన్నిసార్లు సినిమా చేసే అవకాశం వచ్చిన తాను అసలు మిస్ చేసుకోనని తెలిపారు.ఈ విధంగా సమంత ఒక ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ అంటే ఇష్టమని చెబుతూ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ కావడంతో పవన్ ఫ్యాన్స్ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.మరి ఇష్టమైన హీరో పవన్ కళ్యాణ్ అయితే సమంతకు ఇష్టం లేనటువంటి హీరో ఎవరు అనే సందేహం కూడా అందరిలోనూ తలెత్తుతుంది అయితే ఈ ప్రశ్నకు నేటిజన్సే సమాధానం చెబుతున్నారు.
సమంత
నాగచైతన్య
(Nagachaitanya)ను ప్రేమించి పెళ్లి చేసుకుంది అయితే ప్రస్తుతం వీరిద్దరి మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకుని విడిపోయారు దీంతో నాగచైతన్య అంటేనే తనకు ఇష్టం లేనటువంటి హీరో అని స్పష్టంగా తెలుస్తోంది ఏ అమ్మాయి అయినా తనను ప్రేమించి పెళ్లి చేసుకొని మోసం చేస్తే తనని అస్సలు ఇష్టపడదు దీంతో సమంతకు ఇష్టమైనటువంటి హీరో పవన్ కళ్యాణ్ అయితే ఇష్టం లేనటువంటి హీరో కచ్చితంగా నాగచైతన్యనే అయ్యి ఉంటారంటూ కామెంట్ లు చేస్తున్నారు.