అక్కినేని ఇంట కోడలుగా అడుగుపెట్టిన సమంతకు ఎంత పాపులారిటీ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.చేతి నిండా సినిమాలతో, వరుస విజయాలతో దూసుకుపోతున్న సమంత కరోనా సమయంలో కూడా ఓటీటీ ప్లాట్ ఫామ్ ద్వారా ఎంతో యాక్టివ్ గా ఉండి అందరిని అలరిస్తున్నారు.
ఆహా అనే యాప్ ద్వారా సామ్ జామ్ అనే టాక్ షో కి వ్యాఖ్యాతగా నిర్వహిస్తున్నారు.ఇప్పటికే ఈ షో ద్వారా కొన్ని ఎపిసోడ్ లు ప్రసారం అయ్యాయి.
అయితే ప్రస్తుతం కొంత విరామం తీసుకున్న సమంత తన భర్త నాగచైతన్య పుట్టినరోజు సందర్భంగా మాల్దీవులకు వెళ్లి తెగ ఎంజాయ్ చేస్తున్నారు… మాల్దీవులలో సముద్ర అందాలను వీక్షిస్తూ ఫోటో షూట్ జరుపుకున్న సమంత ఆ ఫోటోలను సోషల్ మీడియాలో తన అభిమానులతో పంచుకున్నారు.అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫోటోలు చక్కర్లు కొట్టేస్తున్నాయి.
ఇందులో ఒక ఫోటో లో సమంత టబ్ బాత్ లో తీసుకున్న ఫోటో షేర్ చేయడంతో నెటిజన్లు ఎక్కువగా ఆ ఫోటోను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.
తెలుగింటి కోడలిగా అడుగు పెట్టి ఎంతో సాంప్రదాయంగా ఉండే సమంత పెళ్లయిన తర్వాత కూడా ఇలాంటి ఫోటో షేర్ చేయడం… ఏంటి సమంత పెళ్లయిన తర్వాత కూడా ఇలాంటి ఫోటోలు పెడుతున్నారా అంటూ….ఒక్కసారి గా తన అభిమానులు షాక్ అవుతున్నారు.అయితే ఇప్పటికే కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ మాల్దీవుల్లో తెగ సందడి చేసిన సంగతి మనకు తెలిసిందే.
ప్రస్తుతం ఈ జంట కూడా మాల్దీవుల అందాలను వీక్షిస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లు ఈ ఫోటోలను చూస్తే తెలుస్తుంది.అయితే సోషల్ మీడియాలో సమంత మాల్దీవులకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.
సినిమాల విషయానికి వస్తే నాగ చైతన్య “లవ్ స్టోరీ” లో నటించారు.అయితే ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.