మీ జుట్టు చాలా అధికంగా ఊడిపోతుందా.? ఎంత ఖరీదైన షాంపూ, ఆయిల్స్ వాడిన హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడం లేదా.? జుట్టు రాలడాన్ని అరికట్టడానికి ఏం చేయాలో అర్థం కావడం లేదా.? డోంట్ వర్రీ.కివి పండుతో హెయిర్ ఫాల్ కు చెక్ పెట్టవచ్చు.ఖరీదైన పండ్లలో కివి పండు( Kiwi fruit ) ఒకటి.కివి పండులో ఎన్నో రకాల విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్ తో సహా అనేక పోషకాలు నిండి ఉంటాయి.
ఆరోగ్యపరంగా కివి పండు అపారమైన ప్రయోజనాలను చేకూరుస్తుంది.
అలాగే జుట్టు సంరక్షణకు సైతం తోడ్పడుతుంది.ముఖ్యంగా హెయిర్ ఫాల్ సమస్యను( Hair fall problem ) దూరం చేసుకోవాలని భావిస్తున్న వారు ఒక చిన్న సైజు కివి పండును తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి తొక్క తీయకుండానే ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఈ ముక్కలను మిక్సీ జార్ లో వేసి స్మూత్ గా గ్రైండ్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ కివి పండు మిశ్రమంలో పావు కప్పు ఫ్రెష్ ఉల్లిపాయ జ్యూస్( Onion juice ) మరియు వన్ టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ ( Olive oil )వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.గంట అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.పది రోజులకు ఒకసారి ఈ కివి పండు హెయిర్ మాస్క్ వేసుకుంటే అదిరిపోయే బెనిఫిట్స్ మీ సొంతం అవుతాయి.
కివి పండులో ఉంటే విటమిన్లు సి మరియు ఇ జుట్టు రాలడాన్ని నిరోధించడంలో గ్రేట్ గా సహాయపడతాయి.మెగ్నీషియం, ఫాస్పరస్ మరియు జింక్ వంటి పోషకాలు నెత్తిమీద రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి.జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి.
కివి పండులోని సహజమైన యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు చుండ్రును నివారిస్తాయి.స్కాల్ప్‌ను హైడ్రేటింగ్ గా ఉంచుతాయి.