ప్రపంచవ్యాప్తంగా దాదాపు ప్రతి ఒక్కరి ఇంట్లో విరివిరిగా ఉపయోగించే కూరగాయల్లో టమాటో( Tomato ) ముందు వరుసలో ఉంటుంది.ప్రస్తుతం టమాటో ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి.
అయినప్పటికీ వాటి వినియోగం ఏమాత్రం తగ్గలేదు.టమాటో ఆరోగ్య పరంగానే కాదు సౌందర్య పరంగా కూడా ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తుంది.ముఖ్యంగా నెలకు రెండుసార్లు ఇప్పుడు చెప్పబోయే విధంగా టమాటో తో ఫేషియల్ చేసుకుంటే మస్తు స్కిన్ కేర్ బెనిఫిట్స్ మీ సొంతం అవుతాయి.
స్టెప్ 1 క్లెన్సింగ్:
ముందుగా చర్మాన్ని క్లెన్సింగ్ చేసుకోవాలి.అందుకోసం ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ టమాటో ప్యూరీ, మూడు టేబుల్ స్పూన్లు పాలు( Milk ) వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు దూది సహాయంతో ఈ మిశ్రమాన్ని ఉపయోగించి ముఖ చర్మాన్ని మరియు మెడను క్లెన్సింగ్ చేసుకోవాలి.
స్టెప్ 2 స్క్రబ్బింగ్:
ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ బియ్యం పిండి( rice flour ), వన్ టీ స్పూన్ షుగర్ పౌడర్, ( sugar powder )వన్ టీ స్పూన్ ఆల్మండ్ ఆయిల్( Almond oil ) మరియు సరిపడా టమాటో ప్యూరీ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి మెడకు అప్లై చేసుకుని రెండు నుంచి మూడు నిమిషాల పాటు స్క్రబ్బింగ్ చేసుకోవాలి.స్క్రబ్బింగ్ వల్ల మృత కణాలు మరియు చర్మ రంధ్రాల్లో పేరుకుపోయిన మురికి తొలగిపోతుంది.టాన్ రిమూవ్ అవుతుంది.
స్టెప్ 3 ప్యాక్: ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ శనగపిండి, వన్ టేబుల్ స్పూన్ చందనం పొడి, వన్ టీ స్పూన్ తేనె మరియు మూడు టేబుల్ స్పూన్లు టమాటో ప్యూరీ వేసుకుని బాగా మిక్స్ చేసి ముఖానికి, మెడకు అప్లై చేసుకోవాలి.15 నిమిషాల తర్వాత వాటర్ తో ప్యాక్ ను తొలగించాలి.నెలకు రెండుసార్లు టమాటోతో ఈ విధంగా ఇంట్లోనే ఫేషియల్ చేసుకోవడం వల్ల స్కిన్ కలర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది.చర్మం ఆరోగ్యంగా మృదువుగా మారుతుంది.మచ్చలు తగ్గుముఖం పడతాయి.మొటిమల సమస్య దూరం అవుతుంది.
అలాగే ఈ టమాటో ఫేషియల్ వల్ల స్కిన్ ఏజింగ్ ఆలస్యం అవుతుంది.మరియు చర్మం ఎల్లప్పుడూ గ్లోయింగ్ గా సైతం మెరుస్తుంది.